అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Banakacharla Project | ఏపీ ప్రభుత్వానికి కేంద్ర జల సంఘం లేఖ రాసింది. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నిర్మిస్తున్న బనకచర్ల ప్రాజెక్ట్ కోసం ఇటీవల కేంద్రం అనుమతుల కోసం దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ ప్రాజెక్ట్ నిర్మాణానికి అనుమతులు ఇవ్వలేమని కేంద్ర నిపుణుల కమిటీ గతంలో చెప్పింది.
తాజాగా కేంద్ర జల సంఘం బనకచర్ల ప్రాజెక్ట్(Banakacharla Project) వివరాలు అడిగింది. గోదావరి వరద జలాలకు సంబంధించి డేటా సమర్పించాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ఏపీ ప్రభుత్వం (AP Government) పోలవరం నుంచి గోదావరి జలాలను తరలించడానికి బనకచర్ల ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టింది. శ్రీశైలం ప్రాజెక్టు కాలువలోని బనకచర్ల హెడ్ రెగ్యూలేటర్ (Banakacharla Head Regulator) వద్దకు గోదావరి జలాలను తరలించాలని ఈ ప్రాజెక్ట్ ఉద్దేశం. అయితే ఈ ప్రాజెక్ట్ నిర్మాణంతో తెలంగాణకు అన్యాయం జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వం (State Government) వాదిస్తోంది. ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy), నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy) ఢిల్లీకి వెళ్లి బనకచర్ల ప్రాజెక్ట్‌కు అనుమతి ఇవ్వొద్దని కేంద్ర జలశక్తి మంత్రిని కోరారు. అనంతరం నిపుణుల కమిటీ ప్రాజెక్ట్‌కు అనుమతులు ఇవ్వలేమని స్పష్టం చేసింది. అయితే తాజాగా సీడబ్ల్యూసీ పోలవరం-బనకచర్ల ప్రాజెక్ట్ వివరాలు అడగడం గమనార్హం. అంతేగాకుండా ఏపీలో ప్రతిపాదిత ప్రాజెక్ట్‌ల వివరాలపై కేంద్రం నివేదిక కోరింది.