అక్షరటుడే, న్యూఢిల్లీ: Helmets : ద్విచక్ర వాహనాల శిరస్త్రాణాలపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఈమేరకు రాష్ట్రాలకు ఆదేశాలు సైతం జారీ చేసింది. నిర్ణీత ప్రమాణాలు పాటించకుండా హెల్మెట్లు తయారు చేసే సంస్థలు, అమ్మేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్(Bureau of Indian Standards – BIS) ఆమోదం పొందిన హెల్మెట్లనే వినియోగించాలని వాహనదారులకు సూచించింది.
Helmets : దేశంలో 21 కోట్ల బైక్స్…
భారత్‌లో సుమారు 21 కోట్ల ద్విచక్ర వాహనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వాహనదారుల భద్రతే ముఖ్యమని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల విభాగం Union Consumer Affairs Ministry వెల్లడించింది. మోటారు, వాహనాల చట్టం-1998 (Motor Vehicles Act-1998) ప్రకారం హెల్మెట్‌ను కచ్చితంగా వాడాలని స్పష్టం చేసింది.
కాగా, నాసిరకం హెల్మెట్ల వల్ల ద్విచక్ర వాహనదారుల భద్రతపై ఆందోళన వ్యక్తం అవుతోంది. రోడ్డు ప్రమాదాల్లో BIS అనుమతి శిరస్త్రాణాల కారణంగానే అనేక మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని పరిశోధనలో వెల్లడైంది.
Helmets : 9 తయారీ సంస్థల లైసెన్సులు రద్దు
దేశంలో గత నెల (జూన్ 2025) నాటికి 176 తయారీ సంస్థలు BIS సర్టిఫికెట్ పొందాయి. కాగా, గత ఆర్థిక సంవత్సరంలో సుమారు 500 హెల్మెట్ శాంపిళ్లను బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్(BIS) టెస్ట్ చేసింది. దేశ రాజధాని ఢిల్లీ(Delhi)లో 2,500 నాసిరకం హెల్మెట్లను గుర్తించి సీజ్ చేసింది. 9 కంపెనీల లైసెన్సులు రద్దు చేసింది.
Helmets : కఠిన చర్యలు..
కొత్తగా స్కూటర్, బైక్ కొనుగోలు చేసేవారికి సంబంధిత డీలరు రెండు హెల్మెట్‌లను అందించేలా కేంద్రం ఇటీవలే నిబంధనలు రూపొందించింది. దేశంలో ఏటా సుమారు ఐదు లక్షల ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదాలను నివారించాలనే ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం తెలిపింది.