అక్షరటుడే, వెబ్‌డెస్క్: Vice President Dhankhar | న్యాయమూర్తి తప్పు చేస్తే అతడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయలేని స్థితిలో కేంద్ర ప్రభుత్వం ఉందని ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ (Vice President Jagdeep Dhankhar) అన్నారు.
న్యాయవ్యవస్థ ముందస్తు అనుమతి లేకుండా ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా నిరోధించే మూడు దశాబ్దాల నాటి న్యాయపరమైన ఉత్తర్వు కారణంగా ప్రభుత్వం ఇబ్బందులకు గురవుతోందని, ఈ క్రమంలో ఏం చేయలేని వైకల్య స్థితిలో ఉందన్నారు. రెండు రోజుల పర్యటన కోసం సోమవారం కేరళ (Kerala) వచ్చిన ఉప రాష్ట్రపతి కొచ్చిలోని నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ అడ్వాన్స్డ్ లీగల్ స్టడీస్‌లోని విద్యార్థులు, అధ్యాపకులతో మాట్లాడారు. ఈ సందర్భంగా జస్టిస్ యశ్వంత్ వర్మ కేసుపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
Vice President Dhankhar | ఆ డబ్బు ఎవరిది..?
ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా (Delhi High Court judge) పనిచేస్తున్న సమయంలో యశ్వంత్ వర్మ అధికారిక నివాసంలో కాలిపోయిన స్థితిలో భారీగా నగదు బయటపడిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఘటనలో ఇప్పటివరకు ఎఫ్ఐర్ నమోదు కాలేదు. సుప్రీంకోర్టు (Supreme Court) అంతర్గత విచారణ జరిపించి, తదుపరి చర్యల కోసం కేంద్ర ప్రభుత్వానికి నివేదికను పంపించింది. అయితే, ఈ ఉదంతంపై తాజాగా స్పందించిన ఉప రాష్ట్రపతి ఈ ఘటనను భయంకర నేరమని అభివర్ణించారు. న్యాయమూర్తి అధికారిక నివాసం నుంచి స్వాధీనం చేసుకున్న పెద్ద మొత్తంలో నగదు విషయాన్ని ఆయన ప్రస్తావిస్తూ, “ఈ డబ్బు కలుషితమైందా? అది న్యాయమూర్తి క్వార్టర్స్‌లో ఎలా చేరింది? వాస్తవానికి అది ఎవరికి చెందినది?” అని ప్రశ్నించారు.
Vice President Dhankhar | ఇది క్రిమినల్ చర్యే..
ఈ కేసులో అనేక చట్టపరమైన నిబంధనలు ఉల్లంఘించినట్లు కనిపిస్తున్నాయని, వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారని ఆశించినట్లు ధన్ ఖడ్ తెలిపారు. “హైకోర్టు న్యాయమూర్తి (High Court judge) అధికారిక నివాసంలో పెద్ద మొత్తంలో నగదు దొరికింది. ఆ నగదును వెంటనే స్వాధీనం చేసుకోవాల్సి ఉండగా, చేసుకోలేదు. దానిని క్రిమినల్ చర్యగా పరిగణించి, దోషులను కనుగొని వారిని న్యాయం ముందు నిలబెట్టాల్సింది. కానీ ఇప్పటివరకు, ఎఫ్ఐఆర్ కూడా నమోదు కాలేదని ” అని ధన్ ఖడ్ (Vice President Jagdeep Dhankhar) అన్నారు. “90ల ప్రారంభంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కారణంగా ఎఫ్ఐఆర్ నమోదు చేయలేనందున కేంద్ర స్థాయిలో ప్రభుత్వం వైకల్యంగా మారింది. నేను న్యాయవ్యవస్థ స్వాతంత్ర్యానికి నా పూర్తి మద్దతు ఉంటుంది. న్యాయమూర్తులను రక్షించడానికి కూడా. కానీ ఇలాంటివి జరిగినప్పుడు ఆందోళన కలిగిస్తుంది” అని పేర్కొన్నారు.