అక్షరటుడే, వెబ్‌డెస్క్ : CBI Director | సీబీఐ డైరెక్టర్ CBI Director ప్రవీణ్ సూద్ పదవీకాలాన్ని పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆయన పదవీ కాలం మే 25తో ముగియనుంది. కాగా.. మరో ఏడాది పాటు పొడిగిస్తూ బుధవారం కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రవీణ్ సూద్ praveen sood సీబీఐ డైరెక్టర్‌గా 2023 మే 25న బాధ్యతలు చేపట్టారు. సాధారణంగా సీబీఐ డైరెక్టర్ పదవీకాలం రెండేళ్లు ఉంటుంది. పదవీ కాలాన్ని ఐదేళ్ల వరకు పొడిగించే అధికారం ప్రభుత్వానికి ఉంది.
సీబీఐ డైరెక్టర్ పదవీకాలం పొడిగింపుపై ప్రధాని మోదీ pm modi సోమవారం తన నివాసంలో లోక్‌సభ ప్రతిపక్ష నేత LOP రాహుల్‌గాంధీ rahul gandhi, భారత ప్రధాన న్యాయమూర్తి CJI సంజీవ్ ఖన్నా Sanjeev Khanna తో భేటీ అయ్యారు. సీబీఐ డైరెక్టర్‌ను వీరు ముగ్గురు కలిసి ఎంపిక చేస్తారు. అయితే ప్రస్తుత డైరెక్టర్ ప్రవీణ్ సూద్ పదవీ కాలాన్ని మరో ఏడాది పొడిగించాలని ఆ భేటీలో నిర్ణయించారు.