అక్షరటుడే, వెబ్డెస్క్ : Kurnool | ఆంధ్రప్రదేశ్లోని కర్నూల్ (Kurnool) జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. దైవ దర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా.. కారు కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు.
కర్నూలు కైతాళంలోని కేసీ కెనాల్ (KC Canal)లోకి ఆదివారం కారు దూసుకెళ్లింది. వెంటనే స్థానికులు కారులోని వారిని రక్షించడానికి ప్రయత్నించారు. అయితే ఇద్దరు గల్లంతై మృతి చెందారు. మరో నలుగురిని స్థానికులు కాపాడారు. కర్ణాటక (Karnataka)లోని హుబ్లీకి చెందిన వీరు రాఘవేంద్ర స్వామి (Raghavendra Swamy) దర్శనానికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో మృతి చెందిన వారిని హుబ్లీకి చెందిన సునీల్ (22), మణికంఠ (23) గా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని కారును బయటకు తీశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
View this post on Instagram