అక్షరటుడే, ఎల్లారెడ్డి: terror attack : జమ్మూ కశ్మీర్ ఉగ్రదాడిలో అమరులైన పర్యాటకుల ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ ఎల్లారెడ్డిలో కొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టారు. భారతీయ జనతా పార్టీ, విశ్వహిందూ పరిషత్ , బజరంగ్ దళ్, హిందూ సంఘాల ఆధ్వర్యంలో ఎల్లారెడ్డి మండలంలోని గాంధీ చౌక్ వద్ద ఈ ప్రదర్శన చేపట్టారు.
అమరులైన భారతీయ హిందువుల ఆత్మలకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. ఉగ్రవాదులు, ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్ కు భారత్ సరైన బుద్ధి చెబుతుందని ఆయా నాయకులు పేర్కొన్నారు.