అక్షరటుడే, వెబ్‌డెస్క్: Railway : పెద్దపల్లి రైల్వే జంక్షన్ (Peddapalli Railway Junction) కి సమీపంలో నిర్మిస్తున్న బైపాస్ రైల్వే మార్గం (bypass railway line) త్వరలోనే అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం ఇంటర్ లాకింగ్, నాన్ ఇంటర్ లాకింగ్ పనులు చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 24 నుంచి 27 వరకు కాజీపేట – బల్లార్ష మార్గం (Kazipet – Ballarsha route) లో నడిచే పలు రైళ్లను పాక్షికంగా, మరికొన్నింటిని పూర్తిగా రద్దు చేస్తున్నారు.
Railway : పూర్తిగా రద్దు అయిన రైళ్లు..
- 67771/72 కరీంనగర్ – సిర్పూర్ టౌన్ – కరీంనగర్ మెము ఎక్స్ ప్రెస్(Karimnagar – Sirpur Town – Karimnagar MEMU Express) (25 నుంచి 27 వ తేదీలలో )
- 17003/04 రామగిరి మెము ఎక్స్ ప్రెస్ (Ramagiri MEMU Express) ( 25 నుంచి 27 వ తేదీల్లో)
- 17035/36 బల్లార్షా – కాజీపేట – బల్లార్షా ఎక్స్ ప్రెస్ (Ballarsha – Kazipet – Ballarsha Express)( 24 నుంచి 26 తేదీల్లో ఎగువ మార్గంలో బల్లార్షా వైపు , 25 నుంచి 27 తేదీల్లో దిగువ మార్గంలో కాజీపేట వైపు )
- 12757/58 సికింద్రాబాద్ – సిర్పూర్ కాగజ్ నగర్ – సికింద్రాబాద్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ (Secunderabad – Sirpur Kagaznagar – Secunderabad Superfast Express) (ఈ నెల 25 నుంచి 27 తేదీల్లో)
Railway : పాక్షికంగా రద్దు చేయబడిన రైళ్ల వివరాలు..
(కాజీపేట/వరంగల్ నుంచి సిర్పూర్ కాగజ్ నగర్ మార్గంలోవి. ఇవి కాజీపేట నుంచి సికింద్రాబాద్ మధ్య మాత్రం యథాతథంగా నడుస్తాయి)
- 17011/12 ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్ (Intercity Express )రైలు హైదరాబాదు – సిర్పూర్ కాగజ్ నగర్ – బీదర్ (25 నుండి 27 వ తేదీల్లో
- 17033/34 భద్రాచలం రోడ్డు – బల్లార్షా – సిర్పూర్ టౌన్ – భద్రాచలం రోడ్డు సింగరేణి మెము ఎక్స్ ప్రెస్ (Bhadrachalam Road – Ballarsha – Sirpur Town – Bhadrachalam Road Singareni MEMU Express) (25 నుండి 27 వ తేదీల్లో)
- భాగ్యనగర్ ఎక్స్ ప్రెస్ (Bhagyanagar Express) 17233 ఎగువ మార్గంలో (24 నుండి 26 వ తేదీల్లో), భాగ్యనగర్ ఎక్స్ ప్రెస్ 17234 దిగువ మార్గంలో (25 నుండి 27వ తేదీల్లో)
Railway : జులై 24న మిగతా వాటి పరిస్థితి ఏమిటంటే..
- కొత్త ఢిల్లీ నుంచి నాంపల్లి హైదరాబాద్ వెళ్లే తెలంగాణ 12724 సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ రైలును దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలో 1:15 గంటలపాటు నియంత్రణ చేస్తారు.
- నిజాముద్దీన్ ఢిల్లీ నుంచి కే.ఎస్.ఆర్ బెంగళూరు సిటీ మధ్య నడుస్తున్న 22692 రాజధాని సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ రైలును దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలో 20 నిమిషాలు నియంత్రణ చేస్తారు.
- చెన్నై సెంట్రల్ నుంచి కొత్త ఢిల్లీ వెళ్లే తమిళనాడు 12621 సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ రైలును దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలో గంట సేపు నియంత్రణ చేస్తారు.
- విశాఖపట్నం నుంచి కొత్త ఢిల్లీ వెళ్లే ఆంధ్రప్రదేశ్ 20806 సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ రైలును 45 నిమిషాల పాటు దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలో నియంత్రణ చేస్తారు.
- తిరుపతి నుంచి కరీంనగర్ వెళ్లే 12761 బై వీక్లీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ రైలు.. 26 వ తేదీ రోజున తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి రాత్రి 8:05 నిమిషాలకు బయలుదేరాల్సి ఉండగా.. 2 గంటల 30 నిమిషాలు ఆలస్యంగా ప్రారంభం అవుతుంది. అంటే రాత్రి 10:35 నిమిషాలకు బయలుదేరుతుంది.