అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Mysore Pak | ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) తర్వాత దేశంలో ప్రజలంతా పాకిస్తాన్ పై (Pakistan) ఆగ్రహం వ్యక్తం చేస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం. 26 మంది అమాయక పర్యాటకులను పాక్‌లోని ఉగ్రవాదులు (Pakistan Terrorists) అతి కిరాతకంగా హతమార్చడంతో 140 కోట్ల భారతీయుల రక్తం మరిగిపోతోంది. అదే సమయంలో ప్రతీ ఒక్కరిలోనూ దేశభక్తి మరింత ఉప్పొంగుతోంది. పాకిస్తాన్ పేరు చెబితే కోపం కట్టలు తెంచుకుంటుంది. మనదేశంలో ఆ పేరుతో ఏది ఉండకూడదనే నినాదం కూడా మొదలైంది. ఇప్పటికే మన దేశంలో ఉన్న కరాచీ బేకరీల (Karachi bakeries) పేర్లు మార్చాలని డిమాండ్లు, ఆందోళనలు, దాడులు జరుగుతున్న వేళ.. తాజాగా మరో అంశం వెలుగులోకి వచ్చింది.
Mysore Pak | సీరియస్ తీసుకున్నాడు..
ఫేమస్ స్వీట్ అయిన మైసూర్ పాక్ (Mysore pak) పేరులో పాక్ అని ఉండడంతో.. కొందరు స్వీట్ షాప్ ఓనర్లు (sweet shop owners).. దాని పేరు మార్చేస్తున్నారు. ఇటీవల మైసూర్ పాక్ స్వీట్లోనూ పాక్ అనే పేరు ఉంది కాబట్టి.. అర్జంట్‌గా మైసూర్ భారత్ (India) అని మార్చాలన్న డిమాండ్లు సరదాగా చేశారు. ఇలాంటి పేరుతో వైరల్ మీమ్స్ (Meems Viral) వచ్చాయి. అందరూ సరదాగా తీసుకున్నారు కానీ.. ఓ రాజస్థాన్ వ్యాపారి మాత్రం ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకొని వెంటనే మైసూపర్ పాక్ పేరును మైసూర్ శ్రీ అని మార్చేసి .. అమ్మడం ప్రారంభించాడు. ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) కోసం తన మద్దతుగను ఇలా చెబుతున్నానని ఆ మిఠాయి వ్యాపారి (Sweet shop owner) అంటున్నారు. ప్రచారం కోసం ఇలా చేయడం లేదని.. దేశభక్తితోనే చేస్తున్నానని చెబుతున్నారు.
మోతీ పాక్, ఆమ్ పాక్, గాండ్ పాక్‌ల పేర్లు కూడా మార్చారు. వాటికి మోతీ శ్రీ, ఆమ్ శ్రీ, గాండ్ శ్రీగా పేర్లు పెట్టారు. అంతేకాదు.. షాపులోనే ఫేమస్ ఐటమ్స్ (famous items) అయిన స్వర్ణ్ భస్మ్ పాక్, చందీ భస్మ్ పాక్ పేర్లను కూడా మార్చారు. వీటన్నిటి పేర్ల చివర పాక్ ఉందన్న కారణంతో షాపు యజమానులు ఈ పని చేశారు. దేశం మీద ఉన్న భక్తితో వాటి పేర్లు మార్చామని తెలిపారు. ఆ స్వీట్ల పేర్ల చివరన ఉన్న పాక్‌కు పాకిస్తాన్‌కు (Pakistan) ఎలాంటి సంబంధం లేదు. సంస్కృతంలో పాకం అంటే వంట. కన్నడలో చెక్కర పాకాన్ని పాక్ అంటారు. మైసూర్ పాక్‌ను (Mysore pak) మొదటగా తయారు చేసింది మైసూర్ నగరంలో (Mysore city) కాబట్టి దీనికి మైసూర్ పాక్ అని పేరు వచ్చింది. ఇదంతా ప్రాంతీయ భాషలకు సంబంధించింది.