అక్షరటుడే, వెబ్‌డెస్క్: Allu Arjun | పాన్ ఇండియా లెవల్‌లో స్టార్‌గా ఎదిగిన అల్లు అర్జున్ (Allu Arjun) ఎల్లప్పుడు సెంట్రాఫ్ అట్రాక్షన్‌గా మారుతుంటాడు. తన లుక్‌తోనే కాకుండా, మాటలతోనూ మంత్ర ముగ్ధులను చేస్తుంటాడు. ‘పుష్ప 2’తో (Pushpa 2 movie) ఇప్పటికే బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ఈ స్టైలిష్ స్టార్ తాజాగా అమెరికాలో జరిగిన ‘నాట్స్ 2025’ (NATS 2025) ఈవెంట్‌లో మెరిశారు.
అమెరికాలోని తెలుగు వారిని ఉద్దేశించి ఆయన ఇచ్చిన స్పీచ్ ఇప్పుడు సోషల్ మీడియాలో (Social Media) వైరల్ అవుతోంది. స్టేజ్‌పైకి వచ్చిన వెంటనే “తెలుగు వారంటే ఫైర్ అనుకున్నారా? వైల్డ్ ఫైర్!” అంటూ పుష్ప యాసలో డైలాగ్ చెప్తే, అక్కడి ప్రేక్షకులు చప్పట్లతో హోరెత్తించారు. “ఇక్కడ ఉన్న తెలుగు జనాలను చూస్తుంటే, హైదరాబాద్ లేదా విశాఖలో ఉన్నట్లే అనిపిస్తోంది అని అన్నారు బన్నీ.
Allu Arjun | హుషారెత్తించే స్పీచ్..
మనం అందరం అమెరికాలో ఒకే చోట కలవడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నాను. “నాట్స్ అంటే నేషనల్ అనుకున్నారా? ఇంటర్నేషనల్! మన కల్చర్‌ని ఈవిధంగా ముందుకు తీసుకెళ్లడం గొప్ప విషయం. ఈ సందర్భంగా నాట్స్ సంస్థకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. అలానే తనను ఆహ్వానించినందుకు ఆనందం వ్యక్తం చేశారు అల్లు అర్జున్. పుష్ప సక్సెస్ ఈవెంట్ సమయంలో బన్నీ.. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth reddy) పేరును మరిచిపోవడం, ఆ తర్వాత సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో ఆయనపై ఆరోపణలు రావడం వంటి విషయాలు అప్పట్లో పెద్ద చర్చకు దారితీశాయి. అప్పట్నుంచి అల్లు అర్జున్ మాట్లాడే ప్రతి మాట, వేసే ప్రతి అడుగు ప్రత్యేక ఆకర్షణగా మారిపోయింది.
ఇక దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు (Raghavendra rao) కూడా ఈ కార్యక్రమంలో సందడి చేశారు. ఇది నా 50 ఏళ్ల దర్శక ప్రస్థానంలో ఒక అద్భుత ఘట్టం అని ఆయన అన్నారు. నేను పరిచయం చేసిన బన్నీ, శ్రీలీల (Heroine sreeleela) ఇక్కడ ఉండడం నాకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది. సుకుమార్‌తో (Director sukumar) నాకు ఒక పోలిక ఉంది. అదేంటంటే గడ్డం. నేను ‘అడవి రాముడు’లో అడవిని నమ్మి స్టార్ డైరెక్టర్ అయితే, నువ్వు ‘పుష్ప’లో అడవిని నమ్మి స్టార్ డైరెక్టర్ అయ్యావు. అల్లు అర్జున్‌ను స్టార్ హీరోగా తీర్చిదిద్దావు అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు రాఘవేంద్రరరావు.
ఇక సుకుమార్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనగా, ఆయన మాట్లాడుతూ.. నా చిత్రం ‘1 నేనొక్కడినే’ను ఇక్కడి ప్రేక్షకులు ఎంతగానో ఆదరించారు. అదే నాకు మరొక సినిమా అవకాశాన్ని తెచ్చిపెట్టిందని, అదే నా కెరీర్‌కు కీలక మలుపు అని అన్నారు. మరోవైపు తెలుగు సినీ పరిశ్రమకు నవీన్ అనే నిర్మాతను ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. మైత్రి మూవీస్ నిర్మించిన ఎన్నో సినిమాలు ఎంతో మందికి ఉపాధి కల్పించాయంటూ ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.
Read all the Latest News on Aksharatoday.in