అక్షరటుడే, వెబ్‌డెస్క్: INDvsENG | లార్డ్స్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మూడో టెస్ట్‌లో భారత బౌలర్లు చెలరేగారు. దీంతో ఇంగ్లిష్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 387 పరుగులకు ఆలౌట్ అయింది. ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో (five-match series) ఇప్పటికే రెండు చెరో మ్యాచ్‌లో గెలిచాయి. సిరీస్ గెలవాలంటే ఈ మ్యాచ్ కీలకం. ఈ క్రమంలో ఆది నుంచి భారత బౌలర్లు (Indian bowlers) నిప్పులు చెలరేగారు. నితిశ్ కుమార్‌రెడ్డి వరుస బంతుల్లో రెండు వికెట్లు తీయడంతో ఇంగ్లాండ్ 44 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది.
INDvsENG | సెంచరీతో ఆదుకున్న రూట్
రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న ఇంగ్లిష్ జట్టును పోప్, జో రూట్ ఆదుకున్నారు. జో రూట్ సెంచరీతో రాణించాడు. లంచ్ తర్వాత తన తొలి ఓవర్లోనే జడేజా ఒల్లి పోప్‌ను (44) ఔట్ చేశాడు. ఓ వైపు వికెట్లు పడుతున్నా.. జో రూట్ సెంచరీ చేశాడు. మరో వైపు భారత పేసర్ జస్పీత్ బుమ్రా (Jasprit Bumrah) ఐదు వికెట్లతో రాణించాడు. ఇంగ్లాండ్ బ్యాటర్లు బెన్ స్టోక్స్ 44, జేమి స్మిత్ 51, బ్రైడన్ కార్స్ 56 పరుగులు చేశారు. దీంతో ఆ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 387 పరుగులు చేసింది. సిరాజ్, నితీశ్‌కుమార్ చెరో రెండు వికెట్లు తీశారు.
INDvsENG | లార్డ్స్‌లో గెలవాలంటే..
భారత్‌కు లార్డ్స్ స్టేడియంలో (Lord Stadium) అంత మంచి రికార్డులు లేవు. ఇక్కడ ఇప్పటి వరకు భారత్ 19 మ్యాచ్‌లు ఆడగా మూడు సార్లు మాత్రమే విజయం సాధించింది. 12 సార్లు ఇంగ్లాండ్ గెలవగా.. నాలుగు మ్యాచ్‌లు డ్రా అయ్యాయి. దీంతో ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలుపొందాలని భారత్ భావిస్తోంది. అయితే ఇక్కడ గెలవడం అంత ఈజీ కాదు. కానీ భారత జట్టు తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్ చేయగలిగితే మాత్రం విజయం సొంతం చేసుకోవచ్చు.