అక్షరటుడే, వెబ్‌డెస్క్: Jasprit Bumrah | లార్డ్స్ మైదానంలో భారత్–ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ ఉత్కంఠగా సాగుతోంది. మొదటి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ జట్టు 387 పరుగులకు ఆలౌట్ కాగా, భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) అద్భుత బౌలింగ్‌తో ఐదు వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. అయితే రెండో రోజు ఆట ముగిసిన తర్వాత బుమ్రా మీడియా సమావేశంలో పాల్గొన్నాడు. భద్రతా నిమిత్తం జర్నలిస్టులు (Journalists) తమ మొబైల్ ఫోన్లను టేబుల్‌పై ఉంచగా, సమావేశం మధ్యలో ఓ రిపోర్టర్ ఫోన్ రింగ్ అయ్యింది. దాన్ని గమనించిన బుమ్రా నవ్వుతూ, “ఎవరి భార్యో ఫోన్ చేస్తోంది.. కానీ నేను ఈ ఫోన్ ఎత్తను” అని సరదాగా వ్యాఖ్యానించాడు.
Jasprit Bumrah | ఫన్నీ కామెంట్స్..
ఆ తర్వాత ముందుగా అడిగిన ప్రశ్నకు సమాధానం ఇవ్వబోతూ, “మీరు అడిగిన ప్రశ్న మర్చిపోయా… మళ్లీ అడగండి” అని నవ్వుతూ చెప్పాడు. దీంతో మీడియా సమావేశం (Press Conference) సరదాగా సాగింది. అక్కడున్న వారంతా కాసేపు నవ్వుకున్నారు. మొదటి రోజు కేవలం ఒక వికెట్ మాత్రమే తీసిన బుమ్రా, రెండో రోజున స్టోక్స్, జో రూట్, హ్యారీ బ్రూక్, ఆర్చర్ వంటి కీలక ఆటగాళ్లను ఔట్ చేస్తూ మ్యాచ్‌ను భారత్ వైపునకు తిప్పాడు. హ్యారీ బ్రూక్(Harry Brooke)ను బౌల్డ్ చేసిన బంతి ప్రత్యేకంగా ఆకట్టుకుంది. మొత్తంగా బుమ్రా ఐదు వికెట్లు తీసి మళ్లీ తన ‘బూమ్ బూమ్’ ఫామ్‌ను చూపించాడు.
ఇంగ్లాండ్ (England)కు ధీటుగా బదులిచ్చే క్రమంలో భారత్ రెండో రోజు బ్యాటింగ్‌ను ప్రారంభించింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్లు కోల్పోయి 145 పరుగులు చేసింది. ఇక మూడో రోజు కేఎల్ రాహుల్ (85 నాటౌట్), పంత్ (Rishabh Pant) (55 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడుతున్నారు. ఇద్దరు బ్యాట్స్‌మెన్స్ వంద పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. గాయంతో బాధపడుతున్న పంత్ అలానే బ్యాటింగ్ చేస్తూ మరో అర్ధసెంచరీ చేశాడు. ఇక రాహుల్ నిలకడగా ఆడుతున్నారు. ప్రస్తుతం భారత్ 3 వికెట్లు కోల్పోయి 216 పరుగులు చేసింది. ఇంగ్లండ్ స్కోరుని సమం చేయాలంటే మరో 171 పరుగులు చేయాల్సి ఉంది.