Stock market | బుల్‌ రన్‌ కంటిన్యూ.. ఒక శాతం పెరిగిన సెన్సెక్స్‌.. రూ.5.5 లక్షల కోట్లు పెరిగిన ఇన్వెస్టర్ల సంపద

0
Stock market | బుల్‌ రన్‌ కంటిన్యూ.. ఒక శాతం పెరిగిన సెన్సెక్స్‌.. రూ. 5.5 లక్షల కోట్లు పెరిగిన ఇన్వెస్టర్ల సంపద
Stock market | బుల్‌ రన్‌ కంటిన్యూ.. ఒక శాతం పెరిగిన సెన్సెక్స్‌.. రూ. 5.5 లక్షల కోట్లు పెరిగిన ఇన్వెస్టర్ల సంపద

అక్షరటుడే, వెబ్​డెస్క్: stock market | దేశీయ స్టాక్‌ మార్కెట్‌(Domestic stock markets)లో బుల్‌ రన్‌ కంటిన్యూ అవుతోంది. సోమవారం గ్లోబల్‌ మార్కెట్లు (Global markets) మిక్స్‌డ్‌గా ట్రేడ్‌ అవుతున్నా.. మన ఇండెక్స్‌లు మాత్రం పరుగులు తీశాయి. కొత్త వారాన్ని సూచీలు పాజిటివ్‌(Positive)గా ప్రారంభించాయి. ఉదయం 350 పాయింట్ల లాభంతో ప్రారంభమైన సెన్సెక్స్‌ (Sensex) తొలుత కొంత ఒడిదుడుకులకు లోనైనా తర్వాత పైపైకి దూసుకుపోయింది. ఇంట్రాడే(Intraday)లో గరిష్టంగా 1,282 పాయింట్లు పెరిగింది.

చివరికి 855 పాయింట్ల లాభంతో 79,408 వద్ద ముగిసింది. నిఫ్టీ(Nifty) 98 పాయింట్ల లాభంతో ప్రారంభమై ఇంట్రాడేలో గరిష్టంగా 338 పాయింట్లు లాభపడింది. ట్రేడింగ్‌ ముగిసే సమయానికి 273 పాయింట్ల లాభంతో 24,125 వద్ద స్థిరపడింది. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్‌(Midcap) ఇండెక్స్‌ 2.20 శాతం పెరగ్గా.. స్మాల్‌ క్యాప్‌ ఇండెక్స్‌1.98 శాతం లాభపడింది. ట్రంప్‌ టారిఫ్‌(Trump tariff)ల ప్రభావంనుంచి మన మార్కెట్లు బయటపడుతున్నాయి. అమెరికాతో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కుదరడానికి అవకాశాలు ఉండడం, రూపాయి విలువ బలపడుతుండడం, బ్యాంకింగ్‌ రంగ స్టాక్స్‌ క్యూ4 రిజల్ట్స్‌ (Q4 results) ఆశాజనకంగా ఉండడంతో ఇన్వెస్టర్లలో మన మార్కెట్లపై నమ్మకం పెరుగుతోంది. దీంతో సూచీలు జీవన కాల గరిష్టాల దిశగా దూసుకుపోతున్నాయి.

stock market | బుల్స్ ఆధిపత్యం

బుల్స్ ఆధిపత్యం కొనసాగుతోంది. బీఎస్‌ఈ(BSE)లో నమోదైన కంపెనీలలో 2,918 లాభాలతో, 1,168 నష్టాలతో ముగియగా.. 161 కంపెనీలు ఫ్లాట్‌గా ఉన్నాయి. 115 కంపెనీలు 52 వారాల గరిష్టాలకు చేరగా.. 48 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద ట్రేడ్‌ అయ్యాయి. పది స్టాక్స్ అప్పర్ సర్క్యూట్ ను తాకగా ఆరు స్టాక్స్ లోయర్ సర్క్యూట్ ను తాకాయి. అన్ని రంగాల షేర్లు రాణిస్తుండడంతో బీఎస్‌ఈలో నమోదైన కంపెనీల సంపద విలువ రూ.5.47 లక్షల కోట్లు పెరిగింది.

stock market | రాణించిన అన్ని రంగాలు..

బుల్‌ రన్‌(Bull run)లో అన్ని రంగాల షేర్లు రాణిస్తున్నాయి. ప్రధానంగా బీఎస్‌ఈ ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ సెక్టార్‌ 2.61 శాతం పెరగ్గా.. మెటల్‌ సెక్టార్‌(Metal sector) 2.60 శాతం పెరిగింది. పవర్‌ ఇండెక్స్‌ 2.49 శాతం, రియాలిటీ ఇండెక్స్‌ 2.27 శాతం లాభపడ్డాయి. ఎనర్జీ, ఆటో, పీఎస్‌యూ, ప్రైవేట్‌ బ్యాంక్‌ సూచీలు కూడా రెండు శాతానికిపైగా పెరిగాయి. బ్యాంక్‌, ఫిన్‌ నిఫ్టీ(Fin nifty)లు జీవన కాల గరిష్టాల వద్ద కొనసాగుతున్నాయి.

stock market | Top Gainers..

బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 30 ఇండెక్స్‌లో 23 కంపెనీలు లాభాలతో ముగియగా ఏడు కంపెనీలు మాత్రం నష్టాలతో ముగిశాయి. టెక్‌ మహీంద్రా 4.91 శాతం, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ 4.24 శాతం లాభపడ్డాయి. బజాజ్‌ ఫైనాన్స్‌, ఎంఅండ్‌ఎం మూడు శాతం, హెచ్‌సీఎల్‌ టెక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, ఎస్‌బీఐ, కొటక్‌ బ్యాంక్‌, ఇన్ఫోసిస్‌ రెండు శాతానికిపైగా పెరిగాయి.

stock market | Top Losers..

అదాని పోర్ట్స్‌ 1.32 శాతం పడిపోగా హెచ్‌యూఎల్‌, ఐటీసీ 1.04 శాతం, ఆసియా పెయింట్‌ 0.99 శాతం నష్టపోయాయి.