అక్షరటుడే, వెబ్‌డెస్క్: Amarnath Yatra | అమర్‌నాథ్ యాత్ర 2025కు వెళ్తున్నారా? అయితే, మీ కనెక్టివిటీకి సంబంధించి ఒక శుభవార్త. ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (Bharat Sanchar Nigam Limited)(BSNL), అమర్‌నాథ్ యాత్రికుల కోసం ప్రత్యేక ‘యాత్ర సిమ్’ కార్డును (Yatra SIM card) అందుబాటులోకి తీసుకొచ్చింది. యాత్రికులు అధిక చార్జీలు చెల్లించాల్సిన అవసరం లేకుండా తమ కుటుంబ సభ్యులతో నిరంతరం కనెక్ట్ అవుతూ, ఆధ్యాత్మిక ప్రయాణాన్ని కొనసాగించొచ్చు. రూ.196 రీఛార్జ్ ప్లాన్‌తో వచ్చే ఈ యాత్ర సిమ్‌కి 15 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది.
Amarnath Yatra | వారి కోసం ప్రత్యేక సిమ్..
ఫీచర్స్ చూస్తే.. 4G కనెక్టివిటీ, అన్‌లిమిటెడ్ కాల్స్, అన్‌లిమిటెడ్ డేటా (15 రోజుల పాటు). యాత్ర సిమ్ ఎక్కడ దొరుకుతుంది?అంటే ఈ ప్రత్యేక సిమ్‌ను అమర్‌నాథ్ యాత్ర మార్గంలోని (Amarnath Yatra route) ముఖ్య ప్రదేశాల్లో సులభంగా పొందొచ్చు. లఖన్‌పూర్, పహల్గాం, బాల్టాల్, చంద్రకోట్, భగవతి నగర్, జమ్మూ కాశ్మీర్‌లోని చెక్‌పోస్టుల్లోనూ ఇది అందుబాటులో ఉంటుంది. అవసరమైన డాక్యుమెంట్లు ఏంటేంటే… ఈ సిమ్‌ను యాక్టివేట్ చేయాలంటే KYC ప్రక్రియ తప్పనిసరి. అలాగే ఆధార్ కార్డు లేదా ఇతర ప్రభుత్వ గుర్తింపు కార్డు, శ్రీ అమర్‌నాథ్ యాత్ర స్లిప్ డాక్యుమెంట్లు కూడా కావాలి.
వెరిఫికేషన్ అనంతరం, BSNL నుండి తక్షణ 4G యాక్టివేషన్‌తో కూడిన సిమ్ ఇవ్వబడుతుంది. అమర్‌నాథ్ యాత్ర మార్గం భద్రతపరంగా చాలా సున్నితమైనది. అందుకే అక్కడ టెలికాం సేవల కోసం BSNLకే అనుమతి ఉంది. ప్రైవేట్ నెట్‌వర్క్‌లు (Jio, Airtel, Vi మొదలైనవి) అక్కడ పని చేయవు. బీఎస్ఎన్ఎల్ పోస్ట్‌పెయిడ్ లేదా యాత్ర సిమ్‌లు మాత్రమే ఈ మార్గాల్లో పనిచేస్తాయి. బాబా బర్ఫానీ దర్శనానికి వెళ్తున్న యాత్రికులు, దారి పొడవునా భద్రత, కనెక్టివిటీ, కమ్యూనికేషన్ BSNL అందిస్తోంది. భక్తులు శారీరకంగా మాత్రమే కాకుండా డిజిటల్‌గా కూడా కనెక్ట్ అయి ఉండేందుకు ఇది గొప్ప అవకాశం.