అక్షరటుడే, వెబ్‌డెస్క్: Bajireddy jagan | వరంగల్ జిల్లాలో ఆదివారం నిర్వహించనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభ(BRS Silver Jubilee Celebration) కాంగ్రెస్ ప్రభుత్వ పతనానికి నాంది అవుతుందని బీఆర్ఎస్ నేత బాజిరెడ్డి జగన్ Brs state leader bajireddy jagan అన్నారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. వరంగల్ సభ Warangal Sabha కోసం రాష్ట్రం మొత్తం ఎదురుచూస్తోందన్నారు.
కాంగ్రెస్ ఏడాదిన్నర పాలనపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్నారు. మరోసారి కేసీఆర్ KCR అధికారంలోకి రావాలని ప్రజలు బలంగా కోరుకుంటున్నారని పేర్కొన్నారు. సభకు బీఆర్ఎస్ కార్యకర్తలు BRS activists భారీ ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం నుంచి భారీగా జనసమీకరణ జరిగేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఆయన తెలిపారు.