అక్షరటుడే, ఇందూరు: Dinesh Kulachary | పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న ప్రశాంత్‌రెడ్డి (Ex minister Prashanth reddy) రైతులకు చేసిందేమీ లేదని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి అన్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పసుపు బోర్డును (Turmeric Board) పదేపదే అవహేళన చేస్తూ మాట్లాడుతున్న బీఆర్ఎస్ నాయకులు ప్రశాంత్ రెడ్డి, జీవన్ రెడ్డి, కవితలు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
Dinesh Kulachary | 176 మంది పోటీ చేసి కవితను ఓడగొట్టారు..
గతంలో 176 మంది పసుపు రైతులు ఎన్నికల్లో పోటీ చేసి కేసీఆర్ బిడ్డ కవితను (MLC Kavitha) ఓడగొట్టారని గుర్తు చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఏం మాట్లాడుతున్నారో వాళ్లకే తెలియడం లేదన్నారు. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి (Bodhan MLA Sudarshan Reddy) ఇప్పటికీ లెటర్ ప్యాడ్ లేదని ఎద్దేవా చేశారు. రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి (Rural MLA Bhupathi Reddy) క్యాంప్ కార్యాలయం ఎక్కడుందో కార్యకర్తలకే తెలియదన్నారు. కాంగ్రెస్ పాలనలో ఏర్పడిన జాతీయ బోర్డులకు జిల్లా నుంచి ఒక్క ఛైర్మన్‌ను అయినా నియమించారా అని ప్రశ్నించారు. రూరల్ క్యాంపు కార్యాలయం అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారితే ప్రజలకు ఉపయోగపడే విధంగా బీజేపీ చేసిందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు న్యాలంరాజు తదితులు పాల్గొన్నారు.