అక్షరటుడే, వెబ్‌డెస్క్: UK Fighter Jet | నెల రోజులకు పైగా కేరళ(Kerala)లోని తిరువనంతపురంలో ఉండిపోయిన బ్రిటిష్ రాయల్ నేవి విమానం (British Royal Navy Flight) ఎట్టకేలకు టేకాఫ్ అయింది. విమానంలో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో జూన్ 14న బ్రిటిష్ రాయల్ నేవీ F-35B లైట్నింగ్ ఫైటర్ జెట్‌ను పైలెట్ తిరువనంతపురం (Thiruvananthapuram)లో అత్యవసరంగా ల్యాండింగ్ చేసిన విషయం తెలిసింది.
UK Fighter Jet | మొండికేసిన విమానం
ప్రపంచంలోనే అత్యంత అధునాతన యుద్ధ విమానాలలో ఒకటైన ఎఫ్ –35 కేరళలో ల్యాండ్ అయిన తర్వాత తిరిగి ఎగరడానికి మొండికేసింది. విమానంలో ఇంధన కొరతతో పైలెట్ తిరువనంతపురలంలో అత్యవసరంగా ల్యాండ్(Emergency Landing) చేశారు. అనంతరం భారత వైమానిక దళం ఆ విమానంలో ఇంధనం నింపింది. అయినా విమానం హైడ్రాలిక్ ఫెయిల్యూర్ సమస్యతో ఎగరలేక పోయింది. బ్రిటిష్ ఇంజినీరింగ్ నిపుణులు(British Engineering Experts) పలు మార్లు వచ్చి మరమ్మతులు చేశారు. అయినా నెల రోజులకు పైగా ఆ విమానం ఇక్కడే ఉండిపోయింది. 110 మిలియన్ డాలర్లు విలువ చేసే అత్యంత అధునాతన విమానం ఎగరకపోవడంతో సోషల్ మీడియాలో నెటిజన్లు ట్రోలింగ్ చేశారు.
UK Fighter Jet | మరమ్మతులు చేపట్టడంతో..
బ్రిటిష్ రాయల్ ఎయిర్ ఫోర్స్‌కు చెందిన 24 మంది బృందం జూలై 6న కేరళకు వచ్చారు. యుద్ధ విమానానికి మరమ్మతులు చేయడానికి వారు అప్పటి నుంచి ప్రయత్నిస్తున్నారు. ఎట్టకేలకు సోమవారం మరమ్మతులు పూర్తి కావడంతో మంగళవారం ఉదయం విమానం టేకాఫ్ అయింది. కాగా ఇన్ని రోజుల పాటు సదరు విమానానికి కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (CISF) రక్షణాగా ఉంది. కాగా బ్రిటిష్ విమానాన్ని తిరువనంతపురం ఎయిర్‌పోర్టులో ఇన్ని రోజులు పార్కింగ్ చేసినందుకు సరదు ఎయిర్‌పోర్టు అద్దె తీసుకోనున్నట్లు సమాచారం. పార్కింగ్ ఫీజు కింద రోజుకు రూ.26,261 చెల్లించినట్లు తెలుస్తోంది.
VIDEO | Thiruvananthapuram: British Royal Navy F-35B Lightning fighter jet, which made an emergency landing at the international airport over a month ago, takes off.
Known to be one of the most advanced fighter aircraft in the world and worth over USD 110 million, the jet… pic.twitter.com/DjWHCtU9eB
— Press Trust of India (@PTI_News) July 22, 2025