అక్షరటుడే, వెబ్డెస్క్ : Railway Jobs | ఉద్యోగాల jobs కోసం లంచం తీసుకున్న రైల్వే అధికారులపై సీబీసీ cbi కేసులు నమోదు చేసింది. దక్షిణ మధ్య రైల్వేలో ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లు Traffic Inspectors, చీఫ్ కంట్రోలర్ chief controller పోస్టులను భర్తీ చేశారు. ఆయా పోస్టుల నియామకాల కోసం అభ్యర్థుల నుంచి డివిజనల్ ఆపరేషన్స్ మేనేజర్(DOM) లంచం డిమాండ్ చేశారు. దీంతో బాధితులు రైల్వే పోలీసులను, విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన సీబీఐ నిందితుల ఇళ్లలో సోదాలు చేసింది. నిందితులు నలుగురు అభ్యర్థుల నుంచి రూ.1.25 లక్షలు యూపీఐ ద్వారా, ఒక అభ్యర్థి నుంచి రూ.40 వేల నగదు లంచం తీసుకున్నట్లు అధికారులు గుర్తించారు. నిందితుడు, అతడి కుమారుడి ఖాతాల్లో మొత్తం రూ. 31,62,500 అనుమానాస్పద లావాదేవీలను గుర్తించారు. కేసు విచారణ కొనసాగుతోందని అధికారులు తెలిపారు.
