అక్షరటుడే, న్యూఢిల్లీ: Pm Modi : జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్లో ఉగ్రవాదులు జరిపిన పాశవిక దాడి యావత్ భారత దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ తన సౌదీ అరేబియా పర్యటనను మధ్యలోనే విరమించుకున్నారు. నేడు(బుధవారం) ఉదయం మోడీ ఢిల్లీ చేరుకున్నారు. మంగళవారం రాత్రి సౌదీ అరేబియా అధికారికంగా ఏర్పాటు చేసిన డిన్నర్‌లో ప్రధాని మోడీ పాల్గొనలేదు. ఆ రాత్రే ఆయన భారత్‌కు బయలుదేరారు.
Pm Modi | ఎయిర్‌పోర్టులోనే భేటీ
సౌదీ అరేబియా నాయకత్వంతో విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ ఇప్పటికే మాట్లాడారు. ప్రధాని మోడీ పర్యటన మధ్యలోనే విరమించడంపై వారికి వివరణ ఇచ్చారు. ఉదయం ఢిల్లీకి చేరుకున్న ప్రధాని ఎయిర్‌పోర్టులోనే కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్, విదేశాంగశాఖ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీతో భేటీ అయ్యాయి. పహల్గామ్ ఘటనపై చర్చించారు. అంతేకాకుండా కాసేపట్లో కేబినెట్ సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం.