అక్షరటుడే, వెబ్‌డెస్క్:Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్ల(Domestic stock markets)లో నాలుగు రోజుల వరుస నష్టాలకు తెరపడిరది. మంగళవారం రిలీఫ్ ర్యాలీ వచ్చింది. యూఎస్, భారత్ మధ్య మినీ ట్రేడ్ డీల్ త్వరలోనే ఖరారయ్యే అవకాశాలుండడం, రిటైల్ ద్రవ్యోల్బణం(Retail inflation) ఆరేళ్ల కనిష్టానికి తగ్గడం వంటి కారణాలతో ఇన్వెస్టర్లలో సెంటిమెంట్ బలపడిరది.
అన్ని రంగాల స్టాక్స్‌లో కొనుగోళ్ల మద్దతు లభించడంతో ప్రధాన సూచీలు పరుగులు తీశాయి. ఉదయం సెన్సెక్స్ 20 పాయింట్ల స్వల్ప నష్టంతో ప్రారంభమై మరో 12 పాయింట్లు తగ్గింది. కనిష్టాల వద్ద లభించిన కొనుగోళ్ల మద్దతుతో 522 పాయింట్లు ఎగబాకింది. నిఫ్టీ(Nifty) ఏడు పాయింట్ల లాభంతో ప్రారంభమై అక్కడినుంచి ఇంట్రాడేలో గరిష్టంగా 157 పాయింట్లు పెరిగింది. చివరికి సెన్సెక్స్(Sensex) 317 పాయింట్ల లాభంతో 82,570 వద్ద, నిఫ్టీ 113 పాయింట్ల లాభంతో 25,195 వద్ద స్థిరపడ్డాయి.
బీఎస్‌ఈ(BSE)లో నమోదైన కంపెనీలలో 2,576 కంపెనీలు లాభపడగా 1,479 స్టాక్స్ నష్టపోయాయి. 160 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 150 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 36 కంపెనీలు 52 వారాల కనిష్టాల(52 weeks high) వద్ద కదలాడాయి. 6 కంపెనీలు అప్పర్ సర్క్యూట్‌ను, 9 కంపెనీలు లోయర్ సర్క్యూట్‌ను తాకాయి. బీఎస్‌ఈలో నమోదైన కంపెనీల సంపద విలువ రూ. 1.75 లక్షల కోట్లు పెరిగింది.
Stock Market | ఆటో, ఫార్మా స్టాక్స్‌లో ర్యాలీ..
ఆటో, ఫార్మా(Pharma), పీఎస్‌యూ బ్యాంక్ స్టాక్స్ పరుగులు తీశాయి. బీఎస్‌ఈలో ఆటో ఇండెక్స్(Auto index) 1.48 శాతం పెరగ్గా.. హెల్త్‌కేర్ 1.14 శాతం, పీఎస్‌యూ బ్యాంక్ 0.88 శాతం, ఎఫ్‌ఎంసీజీ 0.80 శాతం, రియాలిటీ ఇండెక్స్ 0.79 శాతం, క్యాపిటల్ గూడ్స్ 0.69 శాతం, కన్జూమర్ గూడ్స్ 0.61 శాతం, టెలికాం, కమోడిటీ, ఆయిల్ అండ్ గ్యాస్ ఇండెక్స్‌లు అరశాతానికిపైగా పెరిగాయి. యుటిలిటీ ఇండెక్స్ 0.15 శాతం నష్టంతో కొనసాగుతోంది. స్మాల్ క్యాప్(Small cap) ఇండెక్స్ 0.95 శాతం, మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.83 శాతం, లార్జ్ క్యాప్ ఇండెక్స్ 0.49 శాతం లాభాలతో ముగిశాయి.
Top Gainers:బీఎస్‌ఈ సెన్సెక్స్‌లో 22 కంపెనీలు లాభాలతో 8 కంపెనీలు నష్టాలతో ఉన్నాయి. సన్‌ఫార్మా 2.71 శాతం, ట్రెంట్ 1.66 శాతం, టాటా మోటార్స్ 1.55 శాతం, బజాజ్ ఫైనాన్స్ 1.51 శాతం, ఎంఅండ్‌ఎం 1.28 శాతం లాభాలతో సాగుతున్నాయి.
Top Losers:హెచ్‌సీఎల్ టెక్ 3.31 శాతం, ఎటర్నల్ 1.57 శాతం, టాటా స్టీల్ 0.81 శాతం, కొటక్ బ్యాంక్ 0.68 శాతం, యాక్సిస్ బ్యాంక్ 0.67 శాతం నష్టాలతో ఉన్నాయి.