అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Fake Liquor | హైదరాబాద్(Hyderabad) నగరంలో కల్తీ మాఫియా రెచ్చిపోతుంది. ప్రతి దానిని కల్తీ చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. అల్లం వెల్లుల్లి పేస్ట్ నుంచి మొదలు పెడితే పాలు, పనీరు కూడా కల్తీ చేస్తున్నారు. ఇటీవల పోలీసులు(Police) హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో దాడులు చేసి 52 మందిని అరెస్ట్ చేశారు. తాజాగా మద్యాన్ని కల్తీ చేస్తున్న ముఠా గుట్టును రట్టు చేశారు.
Fake Liquor | స్పిరిట్‌తో..
హైదరాబాద్‌లోని కృష్ణపద్మ అనే స్పిరిట్ కంపెనీ(Krishnapadma Spirit Company)లో నకిలీ మద్యం తయారు చేస్తున్నారు. స్పిరిట్‌తో మద్యం తయారు చేసి బ్రాండెడ్ బాటిళ్లలో నింపుతున్నారు. అనంతరం వాటికి లేబుళ్లు వేసి విక్రయిస్తున్నారు. మంగళవారం ఉదయం ఎక్సైజ్ అధికారులు తనిఖీలు చేసి ఈ ముఠా గుట్టు రట్టు చేశారు. పెద్దమొత్తంలో కల్తీ లిక్కర్(Fake Liquor)తో పాటు తయారీ సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు. నిందితులు మల్లికార్జున్, తోట శివకుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు. నకిలీ లేబుల్స్(Fake Labels), సీసాలు, మూతలను స్వాధీనం చేసుకున్నారు.
Fake Liquor | బెల్ట్ షాపులకు సరఫరా
నకిలీ మద్యం తయారు చేసి ఈ ముఠా గ్రామాల్లోని బెల్ట్ షాపులకు తయారు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. మద్యం దుకణాలకు లిక్కర్ డిపో(Liquor Depot)ల నుంచి సరుకు వస్తుంది. దీంతో వీరు బెల్ట్ షాపులే లక్ష్యంగా దందా నిర్వహిస్తున్నారు. స్పిరిట్‌తో మద్యం తయారు చేసి, వాటికి బ్రాండెడ్ లేబుళ్లు అతికించి విక్రయిస్తున్నారు. కాగా కల్తీ మద్యంతో తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తాయి. స్పిరిట్‌తో తయారు చేసి మద్యం ఆరోగ్యానికి హానికరం.