అక్షరటుడే ఇందూరు: TNGO’s Nizamabad | టీఎన్జీవోస్ నిజామాబాద్ ఆధ్వర్యంలో ఈనెల 15న ఆషాఢం బోనాల ఉత్సవాలు నిర్వహించనున్నట్లు జిల్లా అధ్యక్షుడు నాశెట్టి సుమన్ కుమార్ (Nashetti Suman kumar) తెలిపారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని కార్యాలయంలో ఆదివారం విలేకరులతో సమావేశం నిర్వహించారు.
TNGO’s Nizamabad | ప్రతి ఏడాది ఆషాఢమాసంలో..
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఏడాది ఆషాఢ మాసంలో (Ashada masam) బోనాల ఉత్సవాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈనెల 15న పాత కలెక్టరేట్లోని (Old Collectorate) నవదుర్గా మాత ఆలయ(Navadurga Mata Temple) ప్రాంగణంలో ఉదయం 11 గంటలకు సంబరం నిర్వహిస్తామని వివరించారు. కావున జిల్లాలోని అన్ని శాఖల అధికారులు, ఉద్యోగులు, మహిళా ఉద్యోగులు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, నాల్గో తరగతి ఉద్యోగులు, డ్రైవర్లు, పెన్షనర్లు హాజరుకావాలని కోరారు.
TNGO’s Nizamabad | మహా అన్నప్రసాద కార్యక్రమం..
బోనాల వేడుక అనంతరం మహా అన్నప్రసాద కార్యక్రమం ఉంటుందని సుమన్ తెలిపారు. సమావేశంలో జిల్లా కార్యదర్శి నేతికుంట శేఖర్, సహాధ్యక్షుడు నారాయణరెడ్డి, టీఎన్జీవో కేంద్ర కార్యదర్శి శ్రీనివాస్, కోశాధికారి దినేష్ బాబు, జాఫర్ హుస్సేన్, జాకీర్ హుస్సేన్, మారుతి తదితరులు పాల్గొన్నారు.