అక్షరటుడే, వెబ్‌డెస్క్: BSE Office | ముంబైలోని (Mumbai) బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ కార్యాలయానికి మంగళవారం బాంబు బెదిరింపు(Bomb Threat) వచ్చింది. దీంతో వెంటనే బాంబ్ స్క్వాడ్ రంగంలోకి తనిఖీలు ప్రారంభించింది. బీఎస్ఈ అధికారిక వెబ్‌సైట్‌కు ఈ మెయిల్ ద్వారా అగంతకుల నుంచి బాంబు బెదిరింపు వచ్చింది.
బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లోని ఫిరోజ్ టవర్ భవనం (Firoz Tower building)లో 4 ఆర్‌డీఎక్స్ ఐఈడీ బాంబులను ఉంచామని, అవి మధ్యాహ్నం 3 గంటలకు పేలిపోతాయని అగంతకులు రెండ్రోజుల క్రితం మెయిల్‌లో హెచ్చరించారు. అయితే, ఆదివారం కార్యాలయం ఆఫీస్ మూసి ఉండడంతో అధికారులు గుర్తించలేదు. అయితే, ఆలస్యంగా ఈ మెయిల్‌ను గుర్తించిన ఆఫీస్ సిబ్బంది పోలీసులను సంప్రదించారు. దీంతో అప్రమత్తమైన సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు.
ముంబైలోని రమాబాయి మార్గ్ పోలీస్ స్టేషన్(Ramabai Marg Police Station) లో కేసు నమోదు చేసిన పోలీసులు హుటాహుటిన తనిఖీలు నిర్వహించారు. అయితే, అనుమానాస్పద వస్తువులు లభ్యం కాకపోవడంతో ఫేక్ కాల్‌గా గుర్తించారు. గతంలోనూ నిందితులు ఇలాంటి బెదిరింపు మెయిల్స్ పంపినట్లు గుర్తు చేస్తున్నారు. గుర్తు తెలియని వ్యక్తులపై బీఎన్‌ఎస్ సెక్షన్లు 351(1)(బి), 353(2), 351(3), 351(4) కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. మెయిల్ ఎక్కడి నుంచి వచ్చేందనేది ఆరా తీసే పనిలో నిమగ్నమయ్యారు.