అక్షరటుడే, నిజాంసాగర్: Bjp Nizamsagar | రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో (Local Body Elections) గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు పనిచేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నీలం చిన్నరాజులు అన్నారు. సోమవారం మహమ్మద్ నగర్ (mahammad nagar) మండలంలోని పార్టీ కార్యాలయంలో స్థానిక సంస్థల ఎన్నికల కార్యశాల నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. జిల్లాలో అధిక సంఖ్యలో ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్ స్థానాలు గెలుచుకునేలా కృషి చేయాలన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ సభ్యుడు అనిల్, మండల అధ్యక్షుడు శ్రీకాంత్, నాయకులు శంకర్ పటేల్, జ్ఞానేశ్వర్, ప్రవీణ్ రాజు, మోర్చాల అధ్యక్షులు, తదితరులు పాల్గొన్నారు.