అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Nizamabad Police | జల్సాలకు అలవాటు పడి బైక్ చోరీలకు పాల్పడుతున్న ఒకరిని అరెస్ట్ చేసినట్లు ఐదో టౌన్ పోలీసులు (Fifth Town Police) తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
బోధన్‌కు(Bodhan) చెందిన గంగాధర్ బైక్ చోరీలకు పాల్పడుతూ.. వచ్చిన డబ్బుతో జల్సాలు చేసేవాడు. ఈ క్రమంలో గతనెల 29న నగరంలోని ఐదో టౌన్ పరిధిలో దర్శనం ప్రసాద్ బైక్ చోరీ (Bike theft) కాగా, అతడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆదివారం ఉదయం వర్ని చౌరస్తాలో వాహన తనిఖీలు చేపట్టగా.. అనుమానాస్పదంగా కనిపించిన గంగాధర్ ను అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో నిందితుడు బైక్ చోరీ చేసినట్లు ఒప్పుకున్నాడు. నిందితుడి నుంచి రెండు బైకులు చేసుకుని రిమాండుకు తరలించారు.