More
    HomeతెలంగాణHyderabad Airport | హైదరాబాద్ ఎయిర్‌పోర్టుకు మ‌హ‌ర్దశ‌.. జీఎంఆర్ నుంచి ₹14,000 కోట్ల విస్తరణ ప్రణాళిక

    Hyderabad Airport | హైదరాబాద్ ఎయిర్‌పోర్టుకు మ‌హ‌ర్దశ‌.. జీఎంఆర్ నుంచి ₹14,000 కోట్ల విస్తరణ ప్రణాళిక

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Hyderabad Airport | హైదరాబాద్ శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (Rajiv Gandhi International Airport) మరింత అభివృద్ధి చెంద‌నుంది. దీనిని మ‌రింత అభివృద్ధి చేసేందుకు జీఎంఆర్ గ్రూప్‌(GMR Group) ముందుకొచ్చి దాదాపు ₹14,000 కోట్ల భారీ విస్తరణ ప్రాజెక్టును ప్రకటించింది. ఈ ప్రాజెక్టు ద్వారా విమానాశ్రయాన్ని ప్రపంచ స్థాయిలో తీర్చిదిద్దేలా ప్రణాళికలు రూపొందించారు. విస్తరణలో భాగంగా కొత్త ప్రయాణికుల టెర్మినల్ నిర్మించ‌నున్నారు. సంవత్సరానికి 47 మిలియన్ల ప్రయాణికుల సామర్థ్యం కలిగిన ఆధునిక టెర్మినల్(Modern terminal) నిర్మించనున్నారు. దీని అంచనా ఖర్చు రూ.5,843 కోట్లు.

    Hyderabad Airport | మ‌రిన్ని స‌దుపాయాలు..

    రెండో రన్‌వేతో పాటు ఎలివేటెడ్ క్రాస్ టాక్సీవే(Elevated Cross Taxiway).. విమానాల అధిక రాకపోకలను సులభతరం చేసేందుకు మరో రన్‌వే నిర్మాణంతోపాటు, ఎలివేటెడ్ టాక్సీవే కూడా ఉంటుంది. ఈ పనులకు రూ.2,809 కోట్లు కేటాయించారు. కార్గో, మెట్రో కనెక్టివిటీ, పార్కింగ్ మెరుగుదల కూడా ఈ ప్ర‌ణాళిక‌లో ఉంది. విమానాశ్రయం నుంచి నగరానికి మెట్రో రవాణాను కలిపే ప్రణాళిక, కార్గో టెర్మినల్స్(Cargo terminals) విస్తరణ, పార్కింగ్ స్థలాల పెంపు తదితర అంశాలపై కూడా దృష్టి సారించారు.

    READ ALSO  KTR | రేవంత్​రెడ్డి లొట్టపీసు ముఖ్యమంత్రి : కేటీఆర్

    ఈ మెగా ప్రాజెక్టును 2026 నుండి 2031 ఆర్థిక సంవత్సరాంతం వరకు దశలవారీగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ విస్తరణతో హైదరాబాద్ విమానాశ్రయం(Hyderabad Airport) కేవలం దక్షిణ భారతదేశానికి కాకుండా, అంతర్జాతీయ స్థాయిలో కీలక హబ్‌గా మారే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ప్రయాణికులకు వేగవంతమైన సేవలు, మరింత ఆధునిక వసతులు అందుబాటులోకి రానున్నాయి. ఈ ప్రాజెక్టు పూర్తయితే, హైదరాబాద్‌ ఎయిర్‌పోర్టు దేశంలో అత్యుత్తమ మౌలిక సదుపాయాలు కలిగిన విమానాశ్రయాల్లో ఒకటిగా నిలవనుంది.

    Latest articles

    Apple Foldable iPhone | ఆపిల్ నుంచి తొలి ఫోల్డ‌బుల్ ఫోన్‌.. 2026 నాటికి వ‌చ్చే అవ‌కాశం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :Apple Foldable iPhone | ప్ర‌పంచంలోనే అత్యంత ప్ర‌తిష్టాత్మ‌క సంస్థ ఆపిల్ నుంచి త‌న తొలి...

    Operation Sindoor | కాల్పుల విర‌మ‌ణ మా ప్ర‌తిపాద‌నే.. పాకిస్తాన్ ఉప‌ ప్ర‌ధాని వెల్ల‌డి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :Operation Sindoor | ప‌హ‌ల్గామ్ ఉగ్ర‌దాడికి వ్య‌తిరేకంగా భార‌త్ చేప‌ట్టిన ఆప‌రేష‌న్ సింధూర్‌తో బెంబేలెత్తిన పాకిస్తాన్(Pakistan)...

    Mla pocharam | విద్య, వైద్యరంగాలకు హబ్​గా బాన్సువాడ

    అక్షరటుడే, బాన్సువాడ: Mla pocharam | బాన్సువాడను విద్య, వైద్య రంగాలకు హబ్​గా తీర్చిదిద్దుతున్నామని ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు,...

    OnePlus Bullets Wireless Z3 | ఏఐ ఫీచర్లతో కొత్త నెక్‌ బ్యాండ్‌

    అక్షరటుడే, వెబ్​డెస్క్: OnePlus Bullets Wireless Z3 | వన్‌ప్లస్‌(OnePlus) కొత్త వైర్‌లెస్‌ ఇయర్‌ ఫోన్స్‌ను లాంచ్‌ చేసింది....

    More like this