అక్షరటుడే, వెబ్‌డెస్క్: BJP National President | బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఎన్నికపై ఆసక్తితో పాటు ఉత్కంఠ నెలకొంది. కీలక రాష్ట్రాల్లో ఎన్నికలు ముందున్న తరుణంలో బీజేపీ చీఫ్‌గా ఎవరిని ఎన్నుకుంటారన్న దానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఇప్పటికే రాష్ట్రాల్లో సంస్థాగత ఎన్నికల ప్రక్రియను పూర్తి చేసిన కాషాయ పార్టీ.. ఇక జాతీయ కార్యవర్గంపై దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలో కొత్త సారథి ఎవరన్నది చర్చనీయాంశమైంది. శివరాజ్ చౌహాన్ (Shivraj Chauhan), నితిన్ గడ్కరీ (Nitin Gadkari), ధర్మేంద్ర ప్రధాన్, మనోహర్ లాల్ ఖట్టర్ తో పాటు భూపేంద్ర యాదవ్ (Bhupender Yadav) పేర్లు ప్రచారంలో ఉన్నాయి. ప్రధానంగా ముగ్గురు కేంద్ర మంత్రుల మధ్య తీవ్ర పోటీ నెలకొనగా, భూపేందర్ యాదవ్‌కు అవకాశం దక్కుతుందన్న ప్రచారం జరుగుతోంది. వివాద రహితుడిగా, సౌమ్యుడిగా, పార్టీకి విధేయుడిగా ఉన్న ఆయన వైపే అధిష్టానం మొగ్గు చూపవచ్చన్న భావన వ్యక్తమవుతోంది. ఓబీసీ సామాజిక వర్గానికి చెందిన భూపేందర్ యాదవ్‌కు పార్టీ ముఖ్యులతో సన్నిహిత సంబంధాలున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన పేరే ఖరారయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
BJP National President | సంఘ్ తో అనుబంధం..
రాజస్థాన్(Rajasthan)లోని అజ్మీర్‌లో జన్మించిన భూపేందర్ యాదవ్ మంచి వ్యూహకర్తగా పేరుంది. పార్టీ ఇన్ఛార్జీగా (party in-charge) వివిధ రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగురవేయడంలో కీలకంగా వ్యవహరించారు. చాలా రాష్ట్రాల్లో బీజేపీని బలోపేతం చేయడంలో ప్రముఖ పాత్ర పోషించారు. 1969 జూన్ 30న జన్మించిన భూపేందర్ యాదవ్ విద్యార్థి దశలోనే నాయకుడిగా ఎదిగారు. ఏబీవీపీలో (ABVP) కీలకంగా వ్యవహరించారు. ఆయనకు రాష్ట్రీయ స్వయం సంఘ్ (Rashtriya Swayam sangh) (RSS) మంచి అనుబంధం ఉంది. న్యాయశాస్త్రంలో పట్టా పొందిన ఆయనకు దాదాపు మూడు దశాబ్దాలకు పైగా రాజకీయ అనుభవం ఉంది. 2010లో బీజేపీ జాతీయ కార్యదర్శిగా (BJP national secretary) పని చేసిన ఆయన.. 2012లో తొలిసారి పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు. రాజస్థాన్, గుజరాత్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, బీహార్, మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో (assembly elections) బీజేపీని గెలిపించడంలో కీలకంగా వ్యవహరించారు. 2021లో కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఆయన.. గతేడాది జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో (Maharashtra Assembly elections) బీజేపీ గెలుపునకు అనేక వ్యూహాలు రచించారు. ఆయన ఎన్నికల ప్రణాళికలతో మహా వికాస్ అగాఢి లోని ఏ పార్టీకీ కూడా ప్రతిపక్ష హోదా దక్కలేదు.
BJP National President | ఆయన వైపే మొగ్గు..
బలమైన ఓబీసీ వర్గానికి (OBC community) చెందిన భూపేందర్ యాదవ్ పార్టీలో అందరితో కలుపుగోలుగా ఉంటారు. తనకు అప్పగించిన బాధ్యతలను కచ్చితంగా నెరవేర్చుతారు. అందుకే యాదవ్ వైపు బీజేపీ మొగ్గు చూపే అవకాశముంది. ఆర్ఎస్ఎస్ నేపథ్యం (RSS background), మంచి వ్యూహకర్త, ఓబీసీ సామాజికవర్గం ఆయనకు బలంగా మారాయి. ఇక, ప్రధాని నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi), కేంద్ర హోం మంత్రి అమిత్ షాలకు (Union Home Minister Amit Shah) నమ్మకమైన వ్యక్తి కావడం ఆయనకు మరింత ప్లస్ పాయింట్ అయింది. ఈ నేపథ్యంలో పార్టీలోని మిగతా వారి కంటే యాదవ్‌కే బీజేపీ జాతీయ సారథిగా ఛాన్స్ దక్కే అవకాశముంది.