అక్షరటుడే, వెబ్‌డెస్క్: Pakistan |భారత్ ఎప్పుడు దాడి చేస్తుందోనని వణికిపోతున్న పాకిస్తాన్‌కు ప్రకృతి కూడా పరీక్ష పెడుతోంది. భానుడు ప్రతాపం చూపుతుండడంతో అత్యధిక ఉష్ణోగ్రత(High Temperatures)లతో దాయాది అల్లాడుతోంది. ఇప్పటికే 48 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా, ఈ వారంలో 50 డిగ్రీలకు చేరుకుంటాయని అంచనా వేస్తున్నారు. ఇది ప్రపంచంలోనే ఏప్రిల్లో అత్యధిక ఉష్ణోగ్రతగా రికార్డు అవుతుందని చెబుతున్నారు. వేడి కారణంగా మధ్య, దక్షిణ పాకిస్తాన్(Pakistan)లో గత 48 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకుంది. పాకిస్తాన్‌లోని నవాబ్‌షా(Nawabshah) ఏప్రిల్ 2018లో ప్రపంచంలోనే అత్యధికంగా నమోదైన 50 డిగ్రీల ఏప్రిల్ ఉష్ణోగ్రతను అధిగమించే అవకాశం ఉన్నందున ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని పాకిస్తాన్ వాతావరణ శాఖ(Meteorological Department) సూచించింది.
Pakistan | వణికిపోతున్న పాక్..
పహల్గామ్ ఉదంతం(Pahalgam Incident) తర్వాత భారత్ తీవ్ర ఆగ్రహంతో ఉంది. సీమాంతర ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్న పాక్‌కు తగిన బుద్ధి చెప్పేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ క్రమంలో భారత్(India) నుంచి ఏ స్థాయిలో దాడులు ఉంటాయో తెలియక పాక్ వణికి పోతోంది. అణ్వాయుధాలు ఉన్నాయని శత్రు దేశం డొల్ల ప్రకటనలు చేస్తున్నప్పటికీ, భారత్ కొట్టే దెబ్బ ఏ స్థాయిలో ఉంటుందో వారికి గతానుభవమే. ఏ వైపు నుంచి ఎలా నరుక్కొస్తుందో తెలియక పాక్ పాలకులు ఇప్పటికే బిక్కుబిక్కుమంటున్నారు. సర్జికల్ స్ట్రైక్స్(Surgical Strikes) చేస్తారా.. లేక నేరుగా యుద్ధం చేస్తారా.. లేక వేర్పాటువాదులను ఎగదోస్తారా? భారత్ ప్రణాళికలు ఏమిటో తెలియక తలలు పట్టుకుంటున్నారు. మరోవైపు, అంతర్గత సమస్యలు, ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న అక్కడి ప్రజలు ప్రభుత్వం(Government)పై తిరగబడుతున్నారు. ధరల పెరుగుదల, రేషన్ సమస్యలు.. తాజాగా భారత్ సింధు జలాలు(Indus River) నిలిపి వేయడంతో ప్రభుత్వంపై ఆగ్రహంతో రోడ్లెక్కుతున్నారు. ఇలాంటి తరుణంలోనే ఎండలు దంచికొండుతుండడం పాక్ పాలకులకు కొత్త తలనొప్పి తెచ్చిపెట్టింది. అన్ని వైపులా నుంచి సమస్యలు చుట్టుముడుతుండడంతో ఏం చేయాలో అర్థం కాక భారత్‌పై కారుకూతలు కూస్తున్నారు. దీనిపైనా అక్కడి ప్రజలు మీమ్స్ రూపంలో విమర్శలు ఎక్కుపెడుతున్నారు.
Pakistan | ఏ దేశాలు అత్యంత వేడిగా ఉంటాయి?
ఈ వారం 21 దేశాలలో 110 డిగ్రీల ఫారెన్‌హీట్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు(Temperatures) నమోదవుతాయని అంచనా. పాకిస్తాన్, ఇరాన్, కువైట్, సౌదీ అరేబియా, మౌరిటానియా, భారతదేశం, ఇరాక్, ఖతార్, సూడాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఒమన్, దక్షిణ సూడాన్, బహ్రెయిన్, మాలి, సెనెగల్, చాడ్, ఇథియోపియా, నైజర్, ఎరిట్రియా, నైజీరియా మరియు బుర్కినా ఫాసో లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయని అత్యంత విశ్వసనీయమైన ECMWF అంచనా వేసింది. ప్రపంచ ఉష్ణోగ్రత డేటా ప్రకారం ఏప్రిల్ 2025లో ఇప్పటికే అసాధారణ ఎండలు నమోదయ్యాయి. భూగ్రహం మీద 63% సగటు కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదు కావడం గమనార్హం.