ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిDouble Bedroom Scheme | డబుల్ ఇళ్ల పట్టాల కోసం రోడ్డెక్కిన లబ్ధిదారులు

    Double Bedroom Scheme | డబుల్ ఇళ్ల పట్టాల కోసం రోడ్డెక్కిన లబ్ధిదారులు

    Published on

    అక్షరటుడే, కామారెడ్డి: Double Bedroom Scheme | ఏళ్లు గడుస్తున్నా డబుల్ బెడ్​రూం​ ఇళ్లకు పట్టాలు ఇవ్వట్లేదని లబ్ధిదారులు ఆందోళన చేశారు. ఈ మేరకు శుక్రవారం కామారెడ్డి (Kamareddy) తహశీల్దార్ కార్యాలయం (Tahsildar’s Office) వద్ద రామేశ్వర్ పల్లి (Rameshwar Pally) డబుల్ ఇళ్ల లబ్ధిదారులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఇళ్ల కేటాయింపులు చేసి ఏళ్లు గడుస్తోందన్నారు. ఇళ్లవద్ద వసతుల కోసం కలెక్టరేట్ (Kamareddy Collectorate) వద్ద ధర్నా చేస్తే తప్పా సరైన వసతులు కల్పించలేదన్నారు.

    Double Bedroom Scheme | రోడ్డు కూడా లేదు..

    ప్రస్తుతం రోడ్డు సౌకర్యం సరిగా లేదని, ముఖ్యంగా ఇళ్లపట్టాలు లేక తమకు గుర్తింపు లభించడం లేదని లబ్ధిదారులు వాపోయారు. ధర్నాలు చేస్తేనే వసతులు కల్పిస్తారా అని ప్రశ్నించారు. డబుల్ ఇళ్లు ఇచ్చారని సంబరపడడమే తప్పా పట్టాలు ఇవ్వకపోవడంతో గుర్తింపు లేకుండా పోయిందన్నారు. అధికారులు స్పందించి తక్షణమే పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మున్సిపల్ కమిషనర్, ఎమ్మెల్యే కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు.

    READ ALSO  Kamareddy | గుంతల రోడ్డు.. వరినాట్లు వేసి నిరసన

    Latest articles

    Hyderabad | ప్రజల ప్రాణాలతో చెలగాటం.. నకిలీ మందుల విక్రయం

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Hyderabad | కొందరు వ్యక్తులు తమ లాభం కోసం ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. కల్తీ...

    Nizamabad Police | హెడ్‌ కానిస్టేబుళ్లకు ప్రమోషన్​..

    అక్షరటుడే, నిజామాబాద్‌ సిటీ: Nizamabad Police | నిజామాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ (Nizamabad Police Commissionerate) పరిధిలోని పలువురు...

    CP Sai chaitanya | సీపీని కలిసిన నూతన ఎస్సైలు

    అక్షరటుడే నిజామాబాద్ సిటీ: CP Sai chaitanya | పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పోలీస్ స్టేషన్లలో నియమితులైన ఎస్సైలు...

    Accounts Block | ఖాతాల బ్లాకింగ్​పై వివాదం రాజేసిన ‘ఎక్స్’.. ఇండియాలో ప్రెస్ సెన్సార్ షిప్​పై ఆందోళన

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Accounts Block | కేంద్ర ప్రభుత్వం, సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ‘X’ మధ్య వివాదం...

    More like this