అక్షరటుడే ఇందల్వాయి: Seasonal diseases | సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా మలేరియా అధికారి (District Malaria Officer) డాక్టర్ తుకారాం రాథోడ్ సూచించారు. ఇందల్వాయి (indalwai) మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామాల్లో మురికి నీరు, దోమలు నిల్వ ఉండకుండా చూడాలని.. చెత్తాచెదారం ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని సూచించారు.
తాగునీటి ట్యాంకుల్లో బ్లీచింగ్ పౌడర్‌ను కలపాలని ఆదేశించారు. ప్రతి ప్రభుత్వ పాఠశాల, కళాశాల, రెసిడెన్సియల్ స్కూళ్లు, కేజీబీవీ పాఠశాలలను(KGBV schools) వైద్య సిబ్బంది సందర్శించాలని తెలిపారు. కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్ క్రిస్టినా(Medical Officer Christina), ఆయుష్ వైద్యాధికారి డాక్టర్ భువన, మండల అభివృద్ధి అధికారి అనంతరావ్, ఆరోగ్య విస్తరణాధికారి వై.శంకర్, గ్రామ కార్యదర్శులు పాల్గొన్నారు.