అక్షరటుడే, ఆర్మూర్: BC SC Rally | గ్రామాల్లో వీడీసీ(VDC)ల దౌర్జన్యాలకు నిరసనగా ఈనెల 29న ఆర్మూర్‌లో బీసీ,ఎస్సీల ఐక్యతా ర్యాలీ నిర్వహించనున్నట్లు బీసీ జేఏసీ BC JAC armor నాయకులు తీర్మానించారు. మంగళవారం పట్టణంలోని సిద్ధార్థ డిగ్రీ కళాశాల(Siddhartha Degree College)లో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు.
డివిజన్ జేఏసీ అధ్యక్షుడి(Division JAC President)గా నరసింహ చారి(Narasimha Chary armoor)ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ర్యాలీని విజయవంతం చేయాలని ఆయన కోరారు. కార్యక్రమంలో బీసీ జనసభ అధ్యక్షుడు రాజారాం యాదవ్ rajaram yadav, వివిధ బీసీ కులాల నాయకులు దత్తాద్రి, యాదగౌడ్, శంకర్, రవినాథ్, మహిపాల్ యాదవ్, రాజన్న, భూమన్న యాదవ్, శంకర్, నరేందర్, సుదర్శన్, రామాగౌడ్, గంగాధర్, నర్సింగ్, శంకర్ గౌడ్, తదిరులు పాల్గొన్నారు.