అక్షరటుడే, వెబ్‌డెస్క్: అసంఘటిత రంగంలో పనిచేస్తున్న పేద, మధ్య తరగతి ప్రజల కోసం కేంద్ర ప్రభుత్వం అటల్ పెన్షన్ యోజన(Atal Pension Yojana)ను అమలు చేస్తోంది. అయితే ఈ పథకంపై చాలా మందికి అవగాహన లేకపోవడంతో సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు. కేవలం రోజుకి ఏడు రూపాయలు చెల్లిస్తే.. నెలనెలా రూ.5వేలు పెన్షన్(Pension) పొందవచ్చు. పదవీ విరమణ తర్వాత ఈ పథకం ఆర్థికంగా బాసట ఇవ్వనుంది.
రైతులు, భవన నిర్మాణ రంగం, రోజువారీ కూలీలు ఇతర అసంఘటితర రంగం(Unorganized sector)లో పనిచేస్తున్న వారు ఈ అటల్ పెన్షన్ యోజన (Atal Pension Yojana) అర్హులు. ఈ పథకం కింద ఈ ఏడాదిలో కొత్తగా 11.7 మిలియన్ల మంది చేరారని కేంద్ర ప్రభుత్వం(Union government) ప్రకటించింది. ఇప్పటి వరకు మొత్తం 7.60 మంది ఈ పథకంలో చేరారు. కాగా.. ఇందులో చేరిన వారికి 60 ఏళ్ల తర్వాత నెలకు రూ.5 వేల వరకు పెన్షన్ అందనుంది.
Atal Pension Yojana | ఇవీ అర్హతలు..
అటల్ పెన్షన్ యోజన(Atal Pension Yojana)ను 2015లో కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. 18 నుంచి 40 ఏళ్లలోపు వారు ఇందులో చేరేందుకు అర్హులు. చిన్న వయసులోనే ఈ స్కీంలో చేరితే ప్రీమియం తక్కువగా వస్తుంది. వయసు ఎక్కువగా ఉంటే ప్రీమియం పెరుగుతుంది. రూ.42 ప్రీమియం చెల్లిస్తే 60 ఏళ్లు నిండిన తర్వాత నెలకు రూ.1,000 వస్తుంది. ఒకవేళ నెలకు రూ.210 ప్రీమియం కింద చెల్లిస్తే.. రిటర్మైంట్ తర్వాత రూ.5వేల చొప్పున పెన్షన్ రానుంది. ఇందుకోసం ఏదేని ప్రభుత్వ రంగ బ్యాంకు లేదా పోస్టాఫీసులో పథకానికి అప్లై చేసుకోవచ్చు. ఆన్‌లైన్ బ్యాంకింగ్‌లో సైతం ఈ సదుపాయం అందుబాటులో ఉంది.