అక్షరటుడే, ఇందూరు: Nizamabad | దైవ దర్శనానికి వెళ్లొస్తూ ఏఎస్సై భార్య దుర్మరణం చెందారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా కేంద్రం(Nizamabad district headquarters)లో చోటుచేసుకుంది. నగరంలో నివాసం ఉండే ఇంటెలిజెన్స్ (Intelligence) ఏఎస్సై(ASI) భీమ్రావు సతీమణి మాక్లూర్ భవాని(58) బుధవారం (జూన్ 9) ఉదయం తన కుమారుడితో కలిసి ద్విచక్ర వాహనంపై బాసర(BASARA)కు వెళ్లారు.
Nizamabad | కుక్క అడ్డు రావడంతో..
అమ్మవారి దర్శనం అనంతరం తిరిగొస్తూ ప్రమాదానికి గురయ్యారు. కంఠేశ్వర్ బైపాస్ (Kanteshwar bypass) మీద వస్తుండగా వీరి వాహనానికి ఒక కుక్క అడ్డుగా వచ్చింది. దీంతో భవాని కుమారుడు సడెన్గా బ్రేక్ వేశాడు. ఈ క్రమంలో వాహనంలో కొంగు చిక్కుకోవడంతో భవాని అదుపు తప్పి కింద పడిపోయారు. కింద పడిన ఆమె తలకు బలమైన గాయం కావడంతో వెంటనే సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే, ఆమెను పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు.
రూరల్ పోలీసులు (RUral Police) ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇంటెలిజెన్స్ ఏఎస్సై భీమ్రావు భార్య భవాని రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంపై పోలీసు అధికారులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భీమ్రావుకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
భీమ్రావు సొంత గ్రామం. మాక్లూరు. ఈ దంపతులకు ముగ్గురు కుమారులు ఉన్నారు. పెద్ద కొడుకు అమెరికా(AMERICA)లో ఉంటున్నాడు. కాగా, పెద్దబాబు వచ్చాకనే సొంతూరు మాక్లూర్(Makloor)లో శుక్రవారం భవాని అంత్యక్రియలు చేయనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.