More
    Homeబిజినెస్​Pre Market Analysis | ఫుల్‌ జోష్‌లో ఆసియా మార్కెట్లు.. పాజిటివ్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌...

    Pre Market Analysis | ఫుల్‌ జోష్‌లో ఆసియా మార్కెట్లు.. పాజిటివ్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Pre Market Analysis : గ్లోబల్‌ మార్కెట్లు(Global markets) ఎక్కువగా పాజిటివ్‌గా కనిపిస్తున్నాయి. ఆసియా మార్కెట్లు ఫుల్‌ జోష్‌(Full josh)లో కనిపిస్తున్నాయి. ట్రేడ్‌ డీల్స్‌ విషయంలో అమెరికా, చైనాల మధ్య వాణిజ్య చర్చలు పున:ప్రారంభం కానుండడం, అమెరికా(America) ఆర్థిక మాంద్యంలోకి వెళ్లొచ్చన్న భయాలు కాస్త తగ్గడంతో మార్కెట్లు ఊపిరి పీల్చుకున్నాయి. అన్ని ప్రధాన స్టాక్‌ మార్కెట్లు లాభాలతో కొనసాగుతున్నాయి.

    Pre Market Analysis : అమెరికా మార్కెట్లు(US markets)..

    నాస్‌డాక్‌(Nasdaq) 1.20 శాతం, ఎస్‌అండ్‌పీ 1.03 శాతం పెరిగాయి. సోమవారం ఉదయం డౌజోన్స్‌ ఫ్యూచర్స్‌ మాత్రం 0.13 శాతం నష్టంతో కొనసాగుతోంది.

    Pre Market Analysis : యూరోప్‌ మార్కెట్లు(European markets)..

    ఎఫ్‌టీఎస్‌ఈ(FTSE) 0.30 శాతం, సీఏసీ 0.19 శాతం లాభపడగా.. డీఏఎక్స్‌ 0.08 శాతం నష్టంతో ముగిసింది.

    READ ALSO  Pre Market Analysis | మిక్స్‌డ్ గా గ్లోబల్‌ మార్కెట్లు.. గ్యాప్‌అప్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    Pre Market Analysis : ఆసియా మార్కెట్లు(Asian markets)..

    ఆసియా మార్కెట్లు సోమవారం ఉదయం దూసుకుపోతున్నాయి. కోస్పీ(Kospi) 1.89 శాతం, హంగ్‌సెంగ్‌ 1.46 శాతం, నిక్కీ 1.04 శాతం, తైవాన్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ 0.0.56 శాతం, షాంఘై 0.33 శాతం, స్ట్రేయిట్స్‌ టైమ్స్‌ 0.18 శాతం లాభాలతో ఉన్నాయి. గిఫ్ట్‌ నిఫ్టీ(Gift nifty) 0.30 శాతం లాభంతో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో మన మార్కెట్లు గ్యాప్‌ అప్‌లో ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

    Pre Market Analysis : గమనించాల్సిన అంశాలు..

    • ఫారిన్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ఇన్వెస్టర్లు(FII) గత ట్రేడిరగ్‌ సెషన్‌లో నికరంగా రూ. 1009 కోట్ల విలువైన స్టాక్స్‌ కొన్నారు. డీఐఐలు నికరంగా రూ.9,342 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేశారు.
    • నిఫ్టీ పుట్‌కాల్‌ రేషియో(PCR) 0.98 నుంచి 1.05 కి పెరగ్గా.. విక్స్‌(VIX) 3 శాతం తగ్గి 14.67 వద్ద ఉంది. ఇది మార్కెట్‌పై బుల్స్‌ ఆధిపత్యాన్ని సూచిస్తోంది.
    • క్రూడ్‌ ఆయిల్‌ ధర(Crude oil) బ్యారెల్‌కు 0.03 శాతం తగ్గి 64.56 డాలర్ల వద్ద ఉంది.
    • డాలర్‌తో రూపాయి మారకం విలువ 17 పైసలు బలపడి 85.64 వద్దకు చేరింది.
    • యూఎస్‌ డాలర్‌ ఇండెక్స్‌ 0.12 శాతం తగ్గి 99కు, యూఎస్‌ పదేళ్ల బాండ్‌ ఈల్డ్‌ 0.31 శాతం తగ్గి 4.50 కు చేరాయి.
    • అమెరికా, చైనా(China) మధ్య వాణిజ్య చర్చలు తిరిగి ప్రారంభం కానుండడంతో ఆసియా మార్కెట్లలో ర్యాలీ కనిపిస్తోంది.
    • అమెరికా జాబ్స్‌ డాటా పాజిటివ్‌గా రావడంతో ఆర్థిక మాంద్యం భయాలు తగ్గుముఖం పట్టాయి. దీంతో గత ట్రేడింగ్‌ సెషన్‌లో వాల్‌స్ట్రీట్‌ పరుగులు తీసింది.
    • ఆర్‌బీఐ(RBI) వడ్డీ రేట్లతోపాటు సీఆర్‌ఆర్‌(CRR) రేట్లలోనూ భారీ కోత విధించడంతో మన మార్కెట్లలో జోష్‌ కొనసాగే అవకాశాలు ఉన్నాయని అనలిస్టులు అంచనా వేస్తున్నారు.
    READ ALSO  Stock Market | స్టాక్‌ మార్కెట్​లో కొనసాగిన ర్యాలీ

    Latest articles

    Khamenei | ఖ‌మేనీని టార్గెట్ చేసిన ఇజ్రాయిల్‌.. చంపొద్ద‌ని వారించిన ట్రంప్‌

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Khamenei : ఇరాన్‌తో యుద్ధం జ‌రుగుతున్న వేళ ఇజ్రాయిల్ భారీ ప్ర‌ణాళిక వేసింది. ఇరాన్ సుప్రీం...

    Caste Census | జ‌న‌, కుల గ‌ణ‌న‌కు స‌న్నాహాలు.. సోమవారం నోటిఫికేష‌న్ విడుద‌ల

    అక్షరటుడే, న్యూఢిల్లీ: కేంద్ర ప్ర‌భుత్వం (central government) జ‌న గ‌ణ‌న‌(population Census)కు స‌న్నాహాలు చేస్తోంది. ఇందుకు సంబంధించి సోమ‌వారం...

    Sonia Gandhi | సోనియాగాంధీకి అస్వ‌స్త‌త‌.. ఆస్ప‌త్రిలో చేరిక‌

    అక్షరటుడే, న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు సోనియాగాంధీ (Senior Congress leader Sonia Gandhi) ఆదివారం అస్వ‌స్త‌త‌కు గుర‌య్యారు....

    CM Revanth | ఆధునిక పరిశ్రమ అవసరాలకు తగినట్లుగా ఐటీఐల సిలబస్‌ అప్‌గ్రేడ్.. ప్రత్యేక కమిటీకు సీఎం ఆదేశం​

    అక్షరటుడే, హైదరాబాద్: CM Revanth : తెలంగాణలో వీఎఫ్ఎక్స్‌, గేమింగ్‌, ఆడియో విజువల్స్ రంగాలకు సంబంధించి సెంటర్ ఆఫ్...

    More like this

    Khamenei | ఖ‌మేనీని టార్గెట్ చేసిన ఇజ్రాయిల్‌.. చంపొద్ద‌ని వారించిన ట్రంప్‌

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Khamenei : ఇరాన్‌తో యుద్ధం జ‌రుగుతున్న వేళ ఇజ్రాయిల్ భారీ ప్ర‌ణాళిక వేసింది. ఇరాన్ సుప్రీం...

    Caste Census | జ‌న‌, కుల గ‌ణ‌న‌కు స‌న్నాహాలు.. సోమవారం నోటిఫికేష‌న్ విడుద‌ల

    అక్షరటుడే, న్యూఢిల్లీ: కేంద్ర ప్ర‌భుత్వం (central government) జ‌న గ‌ణ‌న‌(population Census)కు స‌న్నాహాలు చేస్తోంది. ఇందుకు సంబంధించి సోమ‌వారం...

    Sonia Gandhi | సోనియాగాంధీకి అస్వ‌స్త‌త‌.. ఆస్ప‌త్రిలో చేరిక‌

    అక్షరటుడే, న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు సోనియాగాంధీ (Senior Congress leader Sonia Gandhi) ఆదివారం అస్వ‌స్త‌త‌కు గుర‌య్యారు....