అక్షరటుడే, ఇందూరు: Bonalu Festival | ఆషాఢ మాసం (Ashada masam) చివరి ఆదివారం కావడంతో ఉమ్మడి జిల్లాలో బోనాల సందడి నెలకొంది. ఆయా కుల సంఘాలతో పాటు పలు ఆలయ అభివృద్ధి కమిటీలు ఊరేగింపు నిర్వహించారు. పోతురాజుల విన్యాసాలు.. (Potharajula Vinayasalu) శివసత్తుల పూనకాలతో ఆద్యంతం ఆకట్టుకున్నారు. ఆయా కాలనీల నుంచి తీసుకువచ్చిన బోనాలను నగరంలోని పోచమ్మ ఆలయంలో (Pochamm temple) సమర్పించారు. భక్తుల రద్దీ ఎక్కువ కావడంతో అటువైపు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
Bonalu Festival | పలు సంఘాల ఆధ్వర్యంలో బోనాలు..
నగరంలోని పలు సంఘాల ప్రతినిధులు బోనాలు తీశారు. గాండ్ల పట్టణ సంఘం, కోట మైసమ్మ ఆలయ అభివృద్ధి కమిటీ తదితర సంఘాల ఆధ్వర్యంలో కోటగల్లీ గోల్ హనుమాన్ అంగడిబజార్ మీదుగా పోచమ్మ ఆలయం వరకు బోనాల ఊరేగింపు నిర్వహించారు. గాండ్ల సంఘం ఉత్సవానికి నూడా ఛైర్మన్ కేశవేణు హాజరయ్యారు. నాని యాదవ్ మాతంగి బోనంతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. కోటక్రాంతి మహిళా బృందం ఆధ్వర్యంలో బోనాలు తీశారు. అలాగే బోధన్, బాన్సువాడ, లింగంపేట తదితర ప్రాంతాల్లో బోనాల సంబురాలు నిర్వహించారు.
నగరంలోని గాండ్ల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన బోనాల్లో బోనం ఎత్తుకున్న నుడా ఛైర్మన్ కేశవేణు
నగరంలో గాండ్ల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న మహిళలు
లింగంపేట మండలంలోని కస్తుర్బా పాఠశాలలో బోనాలు
బాన్సువాడలో బోనాలు ఎత్తుకున్న ఎమ్మెల్యే పోచారం, ఆగ్రో ఇండస్ట్రీస్ ఛైర్మన్ కాసుల బాలరాజ్
నగరంలో బోనాల సంబురాల్లో పాల్గొన్న నుడా ఛైర్మన్ కేశ వేణు
బోధన్‌లోని శక్కర్‌నగర్‌లో..
బోధన్ పట్టణంలో..
నగరంలోని కోటగల్లీలో..
నిజాంసాగర్ మండల కేంద్రంలోని ఆర్యబట్ట పాఠశాలలో..
నిజాంసాగర్‌లో..
నగరంలోని సరస్వతినగర్ రోడ్‌నం–1లో..
నగరంలోని గాంధీగంజ్ రిటైల్ కూరగాయల వర్తకుల సంఘం ఆధ్వర్యంలో..
ఎడపల్లి మండలంలోని సరస్వతి విద్యానికేతన్‌లో..