అక్షరటుడే, హైదరాబాద్: driving license renewal : డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ చేసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారా.. ఇలాంటి వారి కోసం తెలంగాణ సర్కారు చక్కని వెసులుబాటు కల్పించింది. ఆర్టీఏ కార్యాలయం చుట్టూ, దళారుల చుట్టూ తిరగాల్సిన పనిలేకుండా అనువైన సదుపాయం తీసుకొచ్చింది.
driving license renewal : అంతా మొబైల్ నుంచే..
డ్రైవింగ్ లైసెన్స్ రెన్యూవల్ కోసం ఆర్టీఏ కార్యాలయానికి వెళ్లాల్సిన పని లేదు. మొబైల్ ఫోన్ లోని రవాణా శాఖ వెబ్సైట్ లో నేరుగా డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ సౌకర్యంతో వాహనదారులకు బిగ్ రిలీఫ్ అనే చెప్పాలి.
driving license renewal : దరఖాస్తు ఇలా..
రవాణా శాఖ వెబ్సైట్లో లైసెన్స్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. అక్కడ డ్రైవింగ్ లైసెన్స్ ను ఎంచుకుంటే మరో పేజీ తెరుచుకుంటుంది. ఆ పేజీలో కింద ఉన్న రెన్యువల్ ఆఫ్ డ్రైవింగ్ లైసెన్స్ పై క్లిక్ చేయాలి. అప్పుడు క్లిక్ హియర్ టు బుక్ దిస్ స్లాట్ అన్న ఆప్షన్ కనబడుతుంది.
driving license renewal : స్లాట్ బుకింగ్ ప్రాసెస్..
బుక్ దిస్ స్లాట్ ఆప్షన్ ఎంచుకుంటే డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ ప్రాసెస్ మొదలవుతుంది. అదే పేజీలో కింద వచ్చిన బాక్స్ లో మనం డ్రైవింగ్ లైసెన్స్ నంబరు, ఆ లైసెన్స్ ఎక్కడ తీసుకున్నాం, పుట్టిన తేదీ, మొబైల్ నంబరు వంటి వివరాలను పొందుపర్చాలి. తదుపరి రిక్వెస్ట్ ఓటీపీ పై క్లిక్ చేస్తే, మొబైల్ నంబరుకు ఓటీపీ వస్తుంది.
driving license renewal : పేమెంట్ విధానం..
ఓటీపీ, క్యాప్చా ను ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ ను నొక్కితే మనం పొందుపర్చిన వివరాలు దర్శనం ఇస్తాయి. ఒకసారి క్రాస్ చెక్ చేసుకుని, కన్ఫామ్ చేస్తే సరిపోతుంది. కన్ఫామ్ నొక్కగానే, వేరొక విండోలో తేదీలు కనిపిస్తాయి. వాటిల్లో వీలున్న తేదీని ఎంచుకొని, ఆ తర్వాత డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ ఫీజు పేమెంట్ చేస్తే సరిపోతుంది.
పేమెంట్ చేశాక, స్లాట్ బుక్ అవుతుంది. దానిని ప్రింట్ తీసుకుని, ఒరిజినల్ లైసెన్స్ గుర్తింపు కార్డుతో ఆర్టీఏ ఆఫీస్ కు ఎంచుకున్న రోజున మాత్రం భౌతికంగా హాజరు కావాల్సి ఉంటుంది. అక్కడ అధికారులు అన్ని చెక్ చేసి డ్రైవింగ్ లైసెన్స్ ను రెన్యువల్ చేస్తారు.