అక్షరటుడే, వెబ్‌డెస్క్: Apprentice Posts | కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(Airports Authority Of India) అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎంపికైనవారికి కోల్‌కతా(Kolkata)లో అప్రెంటిస్‌షిప్ అవకాశం లభిస్తుంది. ఒప్పంద ప్రాతిపదికన ఈ అప్రెంటిస్(Apprentice) పోస్టుల భర్తీ జరుగనుంది. నోటిఫికేషన్(Notification) వివరాలు..
- మొత్తం ఖాళీలు: 34
- పోస్టులవారీగా..
- గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులు : 9
- డిప్లొమా అప్రెంటిస్ పోస్టులు : 12
- ట్రేడ్(ITI) అప్రెంటిస్ పోస్టులు : 13
విభాగాలు: ఇంజినీరింగ్, సివిల్(Civil, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానిక్స్, కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ విభాగాల్లో అప్రెంటిస్‌కు అవకాశం ఉంది.
అర్హత: గుర్తింపు పొందిన సంస్థల నుంచి సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా(Diploma) లేదా డిగ్రీ పూర్తిచేసిన వారు అర్హులు.
స్టైపెండ్ వివరాలు(నెలకు):
- గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ – రూ. 15 వేలు
- డిప్లొమా అప్రెంటిస్ – రూ. 12 వేలు
- ట్రేడ్ (ఐటీఐ) అప్రెంటిస్ – రూ. 9 వేలు
వయోపరిమితి: జూలై 30 నాటికి 18 నుంచి 26 ఏళ్ల మధ్య వయసున్నవారు అర్హులు. ఓబీసీ(OBC), ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ప్రభుత్వం నిబంధనల ప్రకారం వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా..
దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ: ఈనెల 30.
ఎంపిక విధానం: అభ్యర్థుల విద్యార్హతలు, షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ, సర్టిఫికెట్‌ల పరిశీలన, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. పూర్తి వివరాలకు https://www.aai.aero website ను సంప్రదించండి.