అక్షరటుడే ఇందూరు: Teacher Awards | జాతీయ ఉపాధ్యాయ అవార్డుల (National Teacher Award) కోసం జిల్లాలోని ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఈవో అశోక్ తెలిపారు. ఈ మేరకు సోమవారం ప్రకటన విడుదల చేశారు.
Teacher Awards | కేంద్ర మానవ వనరుల శాఖ ఆధ్వర్యంలో..
కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ (Union Ministry of Human Resource Development) ఆధ్వర్యంలో అవార్డులు ఇచ్చేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తన్నట్లు ఆయన వివరించారు. దరఖాస్తు స్వీకరణ తేదీ ఈనెల 17 వరకు పొడిగించినట్లు పేర్కొన్నారు. ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు. అర్హత ఉన్నవారు http://nationalawardstoteachers.education.gov.in/ వెబ్సైట్లో నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు.