అక్షరటుడే, వెబ్డెస్క్:SI Supended | రాష్ట్రంలో ఇటీవల ఎస్సైల సస్పెన్షన్లతో పోలీస్ శాఖ(Police Department)లో కలవరం మొదలైంది. తాజాగా కామారెడ్డి జిల్లాలో ఓ ఎస్సైను Kamareddy district ఐజీ(IG) సస్పెండ్ చేశారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు వేటు వేశారు.
తాజాగా హైదరాబాద్ బాలానగర్ ఎస్సై లక్ష్మీనారాయణ(SI Lakshminarayana Balanagar)ను సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. అవినీతి ఆరోపణలు రావడoతో ఎస్సైని హైదరాబాద్ సీపీ (Hyderabad CP) అటాచ్ చేశారు. కాగా ఎస్సై లక్ష్మీనారాయణపై పలు అవినీతి ఆరోపణలున్నాయి. అంతేగాకుండా ఓ మహిళ కేసు విషయంలో ముగ్గురిని అకారణంగా కొట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో ఉన్నతాధికారులు ఆయనపై చర్యలు తీసుకున్నారు.