అక్షరటుడే, వెబ్‌డెస్క్:Balochistan | ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్(Pakistan)కు మరో షాక్ తగిలింది. ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంక్ అప్పు ఇస్తే గాని పూట గడవని స్థితిలో ఉన్న దాయాది దేశానికి బలూచిస్తాన్(Balochistan) వేర్పాటువాదులు చుక్కలు చూపిస్తున్నారు. ఇటీవల భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌తో పాకిస్తాన్ తీవ్రంగా నష్టపోయింది. అనంతరం బలూచ్ లిబరేషన్ ఆర్మీ(BLA) బలూచిస్తాన్‌లోని కీలక నగరాలను స్వాధీనం చేసుకుంది. అంతేగాకుండా పాకిస్తాన్ సైనికులే లక్ష్యంగా దాడులకు తెగబడుతోంది. అయితే తాజాగా బలూచ్ రిపబ్లిక్ ఆర్మీ(Baloch Republic Army) పాకిస్తాన్‌లోని కీలకమైన గ్యాస్ పైప్‌లైన్‌ను ధ్వంసం చేసింది.
Balochistan | ప్రతీకారంగా..
సుయి గ్యాస్ క్షేత్రాల నుంచి కరాచీకి గ్యాస్ రవాణా చేసే 36 అంగుళాల వ్యాసం కలిగిన గ్యాస్ పైప్‌లైన్(Gas pipeline)ను బీఆర్ఏ ధ్వంసం చేసింది. BRA ప్రతినిధి సర్బాజ్ బలూచ్ మాట్లాడుతూ.. బలూచ్ యోధులు సుయి తెహసిల్‌లోని దొండై ప్రాంతంలోని పైప్‌లైన్‌ను పేలుడు పదార్థాలను ఉపయోగించి పేల్చేశారని తెలిపారు. ఈ పేలుడు కారణంగా భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. అంతేగాకుండా గ్యాస్ సరఫరాకు అంతరాయం కలిగింది.
పాకిస్తాన్ దళాలు ఇటీవల నిరాయుధులైన బలూచ్ యువకులను చంపినందుకు ప్రతీకారంగా ఈ దాడి చేసినట్లు బీఆర్ఏ ప్రకటించింది. BRA అధికారికంగా ఈ ఆపరేషన్‌కు బాధ్యత వహించింది. బలూచ్ వనరుల దోపిడీ, బలూచిస్తాన్‌లో మానవ హక్కుల ఉల్లంఘనలకు వ్యతిరేకంగా దాడులు కొనసాగుతాయని స్పష్టం చేసింది.
Balochistan | బీఆర్ఏ అంటే ఏమిటీ
బలూచ్ రిపబ్లికన్ ఆర్మీ పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్‌లో ఉన్న ఒక సాయుధ ఉగ్రవాద సంస్థ. సెప్టెంబర్ 2010లో పాకిస్తాన్ ప్రభుత్వం(Pakistan Government) బలూచ్ రిపబ్లికన్ ఆర్మీని నిషేధించింది. కాగా బలూచ్ లిబరేషన్ ఆర్మీ(BLA) లాగే ఈ సంస్థ కూడా బలూచ్ వనరుల దోపిడీకి వ్యతిరేకంగా పోరాడుతున్నారు. 2006లో డేరా బుగ్తిలో సైనిక చర్య జరిపి పాక్ బలూచ్ నాయకుడు నవాబ్ అక్బర్ బుగ్తి(Nawab Akbar Bugti)ని హత మార్చింది. ఈ ఘటన అనంతరం బలూచ్ రిపబ్లికన్ ఆర్మీ ఏర్పడింది. మొదట్లో ఈ సంస్థలో బుగ్తి గిరిజనులు చేరారు. కానీ అనంతరం బలూచ్ విద్యార్థులు(Baloch students), యువకులు చేరడంతో పెద్దదిగా మారింది.