More
    HomeజాతీయంEncounter in Bijapur | మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ.. ఇద్దరు అగ్రనేతల మృతి

    Encounter in Bijapur | మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ.. ఇద్దరు అగ్రనేతల మృతి

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :Encounter in Bijapur | వరుస ఎన్​కౌంటర్లతో మావోయిస్టులు (Maoists) ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. కీలక నేతలను కోల్పోతుండటంతో ఆందోళన చెందుతున్నారు. ఛత్తీస్​గఢ్ (Chhattisgarh)​లోని బీజాపూర్​ జిల్లాలో శనివారం ఉదయం మళ్లీ ఎన్​కౌంటర్ చోటు చేసుంది. ఈ ఘటనలో ఇద్దరు అగ్రనేతలు మృతి చెందినట్లు సమాచారం.

    ఛత్తీస్​గఢ్​లోని దండకారణ్యంలో భద్రతా బలగాలు (Security Forces) క్రమంగా పట్టు సాధిస్తున్నాయి. ఆపరేషన్​ కగార్​(Operation Kagar)లో భాగంగా మావోల నిర్మూలనే లక్ష్యంగా బలగాలు సెర్చ్​ ఆపరేషన్​ చేపడుతున్నాయి. ఇందులో భాగంగా మావోయిస్టులకు కంచుకోటగా ఉన్న దండకారణ్యాన్ని సైతం బలగాలు తమ ఆధీనంలోకి తీసుకుంటున్నాయి.

    ఛత్తీస్​గఢ్​లోని బీజాపుర్‌ నేషనల్ పార్క్‌ సమీపంలో మావోయిస్టులు ఉన్నారనే సమాచారం బలగాలు మూడు రోజులుగా కూంబింగ్​ చేపడుతున్నాయి. ఈ ఆపరేషన్​లో భాగంగా శనివారం ఉదయం మళ్లీ ఎన్​కౌంటర్​ చోటు చేసుకుంది. ఇందులో ఇద్దరు మావోయిస్టు అగ్ర కమాండర్లు(Commanders) మృతి చెందారు. వీరి వివరాలు ఇంకా తెలియరాలేదు. ఘటనాస్థలం నుంచి పెద్దఎత్తున ఆటోమేటిక్‌ ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు.

    READ ALSO  Anil Kumar Eravathri | తక్షణమే ఆపరేషన్​ కగార్​ను నిలిపేయాలి

    Encounter in Bijapur | కీలక నేతలు హతం

    గత మూడు రోజులుగా నేషనల్ పార్క్‌ ప్రాంతంతో కూంబింగ్ (Coombing)​ చేపడుతున్న విషయం తెలిసింది. ఈ సందర్భంగా జరిగిన ఎన్​కౌంటర్లలో మావోయిస్టు అగ్రనేతలు సుధాకర్‌, తెలంగాణకు చెందిన భాస్కర్‌ మృతి చెందారు. సుధాకర్‌పై రూ.కోటి, భాస్కర్‌పై రూ.25లక్షల రివార్డ్‌ ఉంది. ఇటీవలే మావోయిస్ట్​ టాప్​ కమాండర్​ నంబాల కేశవరావు సైతం మరణించారు. అగ్ర నేతలు ఎన్​కౌంటర్లలో మృతి చెందుతుండటంతో మావోలు ఆందోళన చెందుతున్నారు. కాగా.. ఆపరేషన్​ ఇంకా కొనసాగుతుందని బలగాలు పేర్కొన్నాయి.

    Latest articles

    Harish Rao | మాజీ మంత్రి హరీశ్​రావుకు అస్వస్థత

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Harish Rao | మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్​రావు(Harish Rao) అస్వస్థతకు గురయ్యారు. హై...

    Yellareddy | ఆలయంలో హుండీ చోరీ కేసులో నిందితుడి అరెస్ట్

    అక్షర టుడే, ఎల్లారెడ్డి: Yellareddy | మండలంలోని హాజీపూర్ తాండలో శ్రీ సేవాలాల్ మహారాజ్ గుడిలో హుండీ చోరీ...

    Real Estate | తెలంగాణలో ఊపందుకున్న ‘రియల్టీ’.. భారీగా పెరిగిన రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయం

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Real Estate | కొన్నాళ్లుగా స్తబ్ధుగా ఉన్న రియల్ ఎస్టేట్ రంగం మళ్లీ ఊపందుకుంటోంది. రాష్ట్రంలో...

    Medical Colleges | వైద్య కళాశాలల్లో వసతుల కోసం కమిటీ : సీఎం రేవంత్​రెడ్డి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Medical Colleges | రాష్ట్రంలోని 34 వైద్య కళాశాల‌లు పూర్తిస్థాయి వ‌స‌తుల‌తో ప‌ని చేయాల‌ని...

    More like this