అక్షరటుడే, వెబ్‌డెస్క్: Vivo X200FE | చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ కంపెనీ అయిన వీవో(Vivo) తన వినియోగదారుల కోసం అదిరిపోయే ఫీచర్లతో మరో ప్రీమియం స్మార్ట్‌ఫోన్(Premium smartphone)ను తీసుకువచ్చింది. తన ఫ్లాగ్ షిప్ ఎక్స్ సిరీస్‌లో ఎక్స్ 200 ఎఫ్‌ఈ పేరుతో సోమవారం భారత మార్కెట్‌లో లాంచ్ చేసింది.
ఇందులోని జెడ్‌ఈఐఎస్‌ఎస్(ZEISS) ఆప్టిమైజ్డ్ కెమెరాలు, శక్తిమంతమైన చిప్‌సెట్, అద్భుతమైన డిస్‌ప్లే ఫ్లాగ్‌షిప్ స్థాయి అనుభవాన్ని ఇస్తాయని భావిస్తున్నారు. అద్భుతమైన ఫీచర్లతో తీసుకువచ్చిన ఈ మోడల్ ఫ్లిప్‌కార్ట్(Flipkart)తోపాటు వివో ఇండియా ఇ స్టోర్‌లలో అందుబాటులో ఉంది. ఫోన్ స్పెసిఫికేషన్స్ ఇలా ఉన్నాయి.
డిస్‌ప్లే:6.31 Inch ఎల్టీపీవో అమోలెడ్ డిస్‌ప్లే, 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌తో దీనిని తీసుకువచ్చారు.
1216 x 2640 రిజల్యూషన్ కలిగి ఉన్న ఈ మోడల్.. హెచ్‌డీఆర్ 10+ను సపోర్ట్ చేస్తుంది.
ఐపీ68, ఐపీ69 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్ ఉంది. మిలిటరీ గ్రేడ్ డ్రాప్ రెసిస్టెన్స్‌ను కలిగి ఉంది.
ప్రాసెసర్: మీడియాటెక్ డైమెన్సిటీ 9300 + SoC, అక్టాకోర్ ప్రాసెసర్ వినియోగించారు.
ఆండ్రాయిడ్ 15 ఆధారిత ఫన్ టచ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది.
కెమెరా: జెడ్‌ఈఐఎస్‌ఎస్ బ్రాండెడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ కలిగి ఉంది. 50 MP మెయిన్ కెమెరా(ఐవోఎస్), 50 MP టెలిఫొటో కెమెరా(ఐవోఎస్, 3ఎక్స్ ఆప్టికల్ జూమ్, 8 MP అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా ఉన్నాయి.
సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం ముందువైపు జెడ్‌ఈఐఎస్‌ఎస్ బ్రాండెడ్ 50 MP ఆటో ఫోకస్డ్ ఫ్రంట్ కెమెరా ఉంది.
బ్యాటరీ: 6,500 ఎంఏహెచ్ లిథియం బ్యాటరీ అమర్చారు. ఇది 90w ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది.
అదనపు ఫీచర్లు:ఐఫోన్ తరహాలో షార్ట్‌కట్ బటన్ ఉంది. ఇది కెమెరా, ఫోకస్ లైట్, నోట్స్, సౌండ్ ఫంక్షన్లు, ఏఐ క్యాప్షన్ మొదలైనవాటిని యాక్సెస్ చేయడానికి అనుమతిస్తుంది.
కలర్స్: అంబర్ యెల్లో, ప్రోస్ట్ బ్లూ, లూక్స్ గ్రే కలర్స్‌లో అందుబాటులో ఉంది.
వేరియంట్స్: రెండు వేరియంట్లలో లభిస్తోంది. 12 GB+ 256 GB వేరియంట్ ధర రూ. 54,999.
16 GB+ 512 GB వేరియంట్ ధర రూ. 59,999. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో 5 శాతం వరకు క్యాష్ బ్యాక్(Cash back) లభిస్తుంది.