అక్షరటుడే, వెబ్‌డెస్క్ :Liquor Scam | ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో సిట్(SIT) దూకుడు పెంచింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు రాజ్ కెసిరెడ్డి(Raj KC Reddy) ఇప్పటికే అదుపులోకి తీసుకున్న సిట్ అధికారులు తాజాగా ఏ6 సజ్జల శ్రీధర్‌ను అరెస్ట్ చేశారు.
ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్(SPY Agro Industries) యజమాని సజ్జల శ్రీధర్ ఈ కేసులో ప్రధాన పాత్ర పోషించినట్లు సిట్ ఆధారాలు సేకరించింది. ఇందులో భాగంగా శుక్రవారం సాయంత్రం హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. శనివారం సిట్ కార్యాలయం(SIT Office)లో విచారణ తర్వాత విజయవాడ ఏసీబీ కోర్టు(Vijayawada ACB Court)లో ఆయనను హాజరు పర్చనున్నారు.