అక్షరటుడే, కామారెడ్డి: NH 44 | ఆగి ఉన్న లారీని వెనుక నుంచి మరొక లారీ ఢీకొన్న ఘటన lorry accident జాతీయ రహదారిపై national highway జరిగింది. కామారెడ్డి మండలం శాబ్దిపూర్ kamareddy shabdhipoor శివారులో బుధవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో చోటు చేసుకుంది.
పోలీసులు(police) తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ నుంచి నాగ్పూర్ hyderabad to Nagpur వైపు వెళ్తున్న లారీ శాబ్దిపూర్ శివారులో మేఘన హోటల్ (Meghana Hotel) వద్ద పార్కింగ్ చేసి ఉంది. వెనక నుంచి వచ్చిన మరో లారీ పార్కింగ్(Parking) చేసి ఉన్న లారీని ఢీకొంది. ఈ ప్రమాదంలో ఢీకొన్న లారీ క్యాబిన్ నుజ్జునుజ్జయింది. దీంతో డ్రైవర్ రాములు క్యాబిన్(Cabin)లో ఇరుక్కుపోయాడు. హైవే పెట్రోలింగ్ highway petrolling ఎస్సై నర్సింలు, సిబ్బంది సదయ్య, హుసేన్ ఘటనాస్థలానికి చేరుకుని క్యాబిన్లో ఇరుక్కున్న రాములును సురక్షితంగా బయటకు తీశారు. అనంతరం జిల్లా ఆస్పత్రికి తరలించారు.