అక్షరటుడే, వెబ్‌డెస్క్: liquor scam : ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కాంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఏ8గా ఉన్న చాణక్యను పోలీసులు అరెస్టు చేశారు. దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన చాణక్యను ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే సిట్ అధికారులు ఏపీ లిక్కర్ స్కామ్ లో రాజ్ కేసిరెడ్డిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. తదుపరి అరెస్టు అయ్యేది ఎవరనే అంశంపై ఉత్కంఠ నెలకొంది.
