అక్షరటుడే, వెబ్‌డెస్క్: Globe Civil Projects IPO | దేశీయ స్టాక్ మార్కెట్(Domestic stock market)లో లిస్టవడం కోసం మరో ఐపీవో (IPO)వస్తోంది. మంగళవారం నుంచి గ్లోబ్ సివిల్ ప్రాజెక్ట్స్ ఐపీవో సబ్‌స్క్రిప్షన్ ప్రారంభం కానుంది. జీఎంపీ 20 శాతం ఉంది.
ఉత్తరప్రదేశ్, ఢిల్లీ(Delhi), హర్యానా, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, గుజరాత్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, ఉత్తరాఖంఢ్, హిమాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాలలో ఇంటిగ్రేటెడ్ ఇంజినీరింగ్, ప్రొక్యూర్‌మెంట్, కన్‌స్ట్రక్షన్ వంటి ఈపీసీ సేవలందించే గ్లోబ్ సివిల్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ కంపెనీ పబ్లిక్ ఆఫర్‌కు వస్తోంది. ఫ్రెష్ ఇష్యూ(Fresh issue) ద్వారా రూ. 10 ఫేస్ వ్యాల్యూ కలిగిన 1.67 కోట్ల షేర్లను విక్రయించి రూ. 119 కోట్లు సమీకరించాలన్నది కంపెనీ లక్ష్యం. ఐపీవో ద్వారా వచ్చేమొత్తాన్ని కొత్త మెషినరీ కొనుగోలు చేయడానికి, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అవసరాల కోసం, కంపెనీ వర్కింగ్ క్యాపిటల్ కోసం, సాధారణ కార్పొరేట్ అవసరాల కోసం వినియోగించనున్నట్లు తెలిపింది.
Globe Civil Projects IPO | కంపెనీ పరిస్థితి..
2023-24 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ రూ. 334.81 కోట్ల రెవెన్యూ(Revenue) ద్వారా రూ. 15.38 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గతేడాది ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు కంపెనీ రూ. 256.74 కోట్ల రెవెన్యూ, రూ. 17.79 కోట్ల నికర లాభాన్ని రికార్డు చేసింది. కంపెనీ ఆస్తులు ఇదే సమయంలో రూ. 317.83 కోట్లనుంచి రూ. 374.60 కోట్లకు పెరిగినట్లు ఆర్‌హెచ్‌పీలో చూపించింది.
Globe Civil Projects IPO | ఐపీవో ప్రైస్ బాండ్..
కంపెనీ ప్రైస్ బాండ్(Price band)ను ఒక్కో ఈక్విటీ షేరుకు రూ. 67 నుంచి రూ. 71గా నిర్ణయించింది. ఒక లాట్‌లో 211 షేర్లుంటాయి. రిటైల్ ఇన్వెస్టర్లు ఒక లాట్ కోసం రూ. 14,981 తో బిడ్ వేయాల్సి ఉంటుంది.
Globe Civil Projects IPO | ఐపీవో తేదీలు..
మంగళవారం ఐపీవో సబ్‌స్క్రిప్షన్(Subscription) ప్రారంభమవుతుంది. 26తో ముగుస్తుంది. 27వ తేదీ రాత్రి అలాట్‌మెంట్ స్టేటస్ వెల్లడయ్యే అవకాశాలున్నాయి. కంపెనీ షేర్లు వచ్చేనెల ఒకటో తేదీన ఎన్‌ఎస్‌ఈ, బీఎస్‌ఈలలో లిస్ట్ కానున్నాయి.
Globe Civil Projects IPO | వాటా
ఈ ఐపీవోలో క్యూఐబీ(QIB)లకు 50 శాతం, ఎన్‌ఐఐలకు 15 శాతం వాటాను కంపెనీ కేటాయించింది. రిటైల్ ఇన్వెస్టర్లకు 35 శాతం రిజర్వ్ చేశారు.
Globe Civil Projects IPO | GMP
గ్లోబ్ సివిల్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ ఐపీవోకు గ్రే మార్కెట్ ప్రీమియం(జీఎంపీ) 14 రూపాయలు ఉంది. అంటే 20 శాతం ప్రీమియంతో గ్రే మార్కెట్‌లో ట్రేడ్ అవుతున్నాయి. జీఎంపీ ఇలాగే ఉంటే లిస్టింగ్ రోజు 20 శాతం లాభం వచ్చే అవకాశాలున్నాయి.