More
    Homeబిజినెస్​Arisinfra Solutions IPO | నేటినుంచి మరో ఐపీవో ప్రారంభం

    Arisinfra Solutions IPO | నేటినుంచి మరో ఐపీవో ప్రారంభం

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Arisinfra Solutions IPO | మెయిన్ బోర్డు ఐపీవో (ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్) కోసం ఎదురుచూస్తున్నవారికోసం బుధవారం మరో కంపెనీ సబ్‌స్క్రిప్షన్‌ ప్రారంభమయ్యింది.

    కన్‌స్ట్రక్షన్​(Construction), ఇన్​ఫ్రాస్ట్రక్చర్ కంపెనీలు సులభంగా జీఐ స్టీల్ పైప్స్, ఎమ్మెస్‌ స్టీల్ వైర్, ఎమ్మెస్‌ టీఎంటీ స్టీల్ బార్స్, ఓపీసీ సిమెంట్ బల్క్‌తో పాటు మరికొన్ని రకాల నిర్మాణ ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి ఒక అధునాతన ప్లాట్ ఫాంని అందిస్తున్న కంపెనీ అయిన అరిస్ ఇన్​ఫ్రా సొల్యూషన్స్(Arisinfra Solutions) లిమిటెడ్‌ ఐపీవోకు వస్తోంది. ఐపీవో(IPO) ద్వారా రూ. 499.60 కోట్లను సమీకరించాలన్నది కంపెనీ లక్ష్యం. ఫ్రెష్ ఇష్యూ(Fresh issue) ద్వారా రూ. 2 ముఖ విలువ కలిగిన 2.25 కోట్ల షేర్లను విక్రయించడం ద్వారా ఈ నిధులను సమీకరించాలని భావిస్తోంది. ఐపీవో ద్వారా వచ్చిన ఆదాయాన్ని కంపెనీ ఇప్పటికే తీసుకున్న రుణాలను పూర్తిగా గాని, పాక్షికంగా గాని చెల్లించడంతోపాటు వర్కింగ్ క్యాపిటల్(Working capital) అవసరాల కోసం, కంపెనీకి చెందిన సబ్సిడరీ కంపెనీలో పెట్టుబడి పెట్టడం కోసం, సాధారణ కార్పొరేట్ అవసరాల కోసం వినియోగించనున్నట్లు కంపెనీ ప్రకటించింది.

    READ ALSO  Today Gold Price | మ‌ళ్లీ షాక్ ఇచ్చిన బంగారం.. నేటి ధర ఎంతంటే..!

    Arisinfra Solutions IPO | సబ్‌స్క్రిప్షన్‌ వివరాలు..

    ఐపీవో సబ్‌స్క్రిప్షన్‌ బుధవారం ప్రారంభమవుతుంది. 20 వరకు అందుబాటులో ఉంటుంది. 23న షేర్ల అలాట్‌మెంట్‌ స్టేటస్‌ వెల్లడి అయ్యే అవకాశాలున్నాయి. 25న కంపెనీ షేర్లు ఎన్ఎస్ఈ(NSE), బీఎస్ఈ(BSE)లలో లిస్ట్ అవనున్నాయి.

    Arisinfra Solutions IPO | ప్రైస్ బ్యాండ్

    కంపెనీ ఒక్కో ఈక్విటీ షేరు ధరను రూ. 210 నుంచి రూ. 222గా నిర్ణయించింది. ఒక లాట్‌లో 67 షేర్లున్నాయి. ఐపీవోలో ఇన్వెస్ట్‌ చేయాలనుకునేవారు ఒక లాట్‌ కోసం రూ. 14,874 తో బిడ్లు దాఖలు చేయాల్సి ఉంటుంది.

    Arisinfra Solutions IPO | కోటా, జీఎంపీ

    క్యూఐబీ(QIB)లకు 75 శాతం వాటాను కేటాయించిన కంపెనీ, ఎన్ఐఐలకు 15 శాతం, రిటెయిల్‌ ఇన్వెస్టర్లకు 10 శాతం వాటాను కేటాయించింది. ఈ కంపెనీ షేర్లు గ్రే మార్కెట్‌లో 11 శాతం ప్రీమియంతో ‍ట్రేడ్‌ అవుతున్నాయి. అంతే ఐపీవో అలాట్‌ అయితే తొలిరోజే 11 శాతం లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

    READ ALSO  Sacheerome | ‘సచీరోమ్‌’కు భారీ స్పందన.. తొలిరోజే 39 శాతం లాభాలకు అవకాశం..

    Latest articles

    Influx Healthtech IPO | ఈ ఐపీవో అలాట్ అయితే జాక్పాట్ కొట్టినట్లే..! నేటినుంచి ఇన్‌ఫ్లక్స్‌ హెల్త్‌టెక్‌ ఐపీవో ప్రారంభం

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Influx Healthtech IPO | ఇన్‌ఫ్లక్స్ హెల్త్‌టెక్ (Influx healthtech) లిమిటెడ్ ఎస్‌ఎంఈ కంపెనీ ఐపీవోకు...

    HDFC IPO | హెచ్‌డీఎఫ్‌సీ నుంచి మరో ఐపీవో.. ఈనెలాఖరులో లిస్టయ్యే అవకాశం

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: HDFC IPO | మార్కెట్‌లోకి మరో మెగా ఐపీవో(Mega IPO) రాబోతోంది. ఇన్వెస్టర్లనుంచి రూ. 12,500...

    MP Arvind | కేసీఆర్ డైర‌క్ష‌న్‌లో కాంగ్రెస్ కుట్ర‌లు.. ఎంపీ అర్వింద్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు

    అక్షరటుడే, వెబ్​డెస్క్:MP Arvind | బీఆర్ఎస్ అధ్య‌క్షుడు కేసీఆర్(BRS President KCR) మార్గ‌ద‌ర్శ‌కత్వంలో కాంగ్రెస్ ప్ర‌భుత్వం ప‌ని చేస్తోంద‌ని...

    Indonesia | ఇండోనేషియాలో బద్దలైన అగ్నిపర్వతం.. వెనక్కి మళ్లిన ఎయిర్ ఇండియా విమానం

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Indonesia | ఇండోనేషియాలో భీకర వాతావరణ నెలకొంది. భారీ అగ్నిపర్వతం బద్దలవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది....

    More like this