అక్షరటుడే, కామారెడ్డి : Kamareddy : రెండో పెళ్లి చేసుకున్న భార్యపై ఉన్న కోపాన్ని ఆమె మొదటి భర్తకు పుట్టిన కూతురి (daughter) ని చంపడం ద్వారా తీర్చుకోవచ్చని పథకం చేసిన భర్త ఆటలు కట్టించారు కామారెడ్డి పోలీసులు. కామారెడ్డి పట్టణ సీఐ నరహరి తెలిపిన వివరాల ప్రకారం..
పట్టణంలో ఉండే జంగం మమత తన రెండున్నరేళ్ల కూతురు కీర్తితో కలిసి అశోక్ నగర్ కాలనీలో గల రాయల్ చికెన్ సెంటర్ ఎదుట ఆదివారం రాత్రి నిద్రించింది. సోమవారం తెల్లవారుజామున 4:30 ప్రాంతంలో లేచి చూసినప్పుడు పక్కనే ఉన్న కూతురు, తిరిగి 6 గంటలకు లేచి చూడగా కనిపించలేదు.
ఎవరో ఒకతను ఎత్తుకెళ్లాడని పక్కనున్న వృద్ధుడు చెప్పడంతో మమత పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు బృందాలుగా గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో సాయంత్రం మున్సిపల్ కార్యాలయం ఎదుట ఉన్న వైన్స్ వద్ద పాపను ఎత్తుకుని మద్యం కొనుగోలు చేస్తున్న వ్యక్తిని పోలీసులు గుర్తించి పట్టుకున్నారు. నిందితుడు రాజు వద్ద ఉన్న పాపను తల్లి వద్దకు చేర్చారు.
Kamareddy : అసలేం జరిగిందంటే..
గర్గుల్ గ్రామానికి చెందిన పిల్లి రాజుకు గతంలో పెళ్లి అయింది. కాగా, 2022 లో రాజును అతని భార్య వదిలి వెళ్ళిపోయింది. అప్పటి నుంచి అశోక్ నగర్ కాలనీలో గల కల్లు దుకాణంలో పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో అతనికి మమత పరిచయం అయింది. వీరు మూడు నెలల క్రితం సిరిసిల్ల రోడ్డులో గల ఎల్లమ్మ ఆలయం Yellamma temple లో వివాహం చేసుకున్నారు.
మమత మొదటి భర్తకు పుట్టిన రెండున్నరేళ్ల కీర్తితో కలిసి ఈ కొత్త జంట అశోక్ నగర్ లో ఉంటున్నారు. అయితే మమత రాజుతో కాకుండా మరో వ్యక్తితో ఉండటాన్ని గమనించి ఆమెను రాజు నిలదీశాడు. దీంతో ఇద్దరికి గొడవ జరిగి వేర్వేరుగా ఉంటున్నారు.
Kamareddy : పొదల్లోకి తీసుకెళ్లి చంపేయాలని ప్లాన్..
ఈ విషయాన్ని మనసులో పెట్టుకున్న రాజు ఎలాగైనా మమతను వేదనకు గురిచేయాలని ప్లాన్ వేశాడు. మమత చికెన్ సెంటర్ వద్ద కూతురితో కలిసి నిద్రించడం గమనించి సోమవారం ఉదయం 5:30 ప్రాంతంలో కీర్తిని ఎత్తుకుపోయాడు. దేవునిపల్లి వైపు ఉన్న పొదల్లో కీర్తిని చంపేస్తే మమత బాధపడుతుందని భావించాడు.
అటుగా వెళ్తూ.. మార్గమధ్యలో మున్సిపల్ కార్యాలయం municipal office ఎదుట ఉన్న వైన్స్ లో మద్యం కొనుగోలు చేస్తూ.. పోలీసులకు చిక్కాడు. రాజును అరెస్టు చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు సీఐ తెలిపారు.