More
    HomeతెలంగాణMinister Sridhar Babu | అతి చేసిన యాంకర్​ ఝాన్సీ.. మంత్రి శ్రీధర్​బాబుకు అవమానం..

    Minister Sridhar Babu | అతి చేసిన యాంకర్​ ఝాన్సీ.. మంత్రి శ్రీధర్​బాబుకు అవమానం..

    Published on

    అక్షరటుడే, హైదరాబాద్: Minister Sridhar Babu : అధికార, అనధికార.. కార్యక్రమం ఏదైనా కొన్ని ప్రొటోకాల్స్ పాటించాల్సి ఉంటుంది. లేకపోతే సమస్యలు తప్పవు. ముఖ్య అతిథి కన్నా.. నటులు గొప్పవారేం కాదన్న కనీస ఇంకిత జ్ఞానం మరిచిపోతున్నారు యాంకర్లు. ఇటీవల మరీ శృతిమించిపోతున్నారు. తాజాగా యాంకర్​ ఝాన్సీ నటి శ్రీలీల కోసం తెలంగాణ ఐటీ మినిస్టర్​ శ్రీధర్​బాబు(Telangana IT Minister Sridhar Babu)నే అవమానించారు.

    హైదరాబాద్(Hyderabad)లో మంగళవారం ఓ హోటల్ లో జరిగిన ఒక లాంచ్ ప్రోగ్రామ్​కు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి దుద్ధిళ్ల శ్రీధర్ బాబు సమయానికి వచ్చేశారు. మంత్రి రావడంతో కార్యక్రమం ప్రారంభించారు. అక్కడ యాంకరింగ్​ చేస్తోంది ఎంతో అనుభవం ఉన్న యాంకర్​, నటి ఝాన్సీ (anchor Jhansi). కార్యక్రమం ప్రారంభం కావడంతో మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతున్నారు. ఇంతలో హీరోయిన్ శ్రీలీల వచ్చి, ముందు వరుసలో కూర్చొంది. ఇక మంత్రి వేదికపై మాట్లాడుతుండగా.. ఝాన్సీ అక్కడికొచ్చారు. మంత్రితో “ఏమనుకోవద్దు సార్ చీఫ్ గెస్ట్ శ్రీలీల వచ్చారు. వేదిక మీదకు పిలుద్దాం. ఆమె ఈ యాప్ లాంచ్ చేయాల్సి ఉంది” అని మంత్రి స్పీచ్ ను నిలిపివేసింది.

    READ ALSO  Weather Updates | నేడు భారీ వర్ష సూచన

    కానీ, సౌమ్యుడైన మంత్రి శ్రీధర్​బాబు కోప్పడకుండా, కూల్​గా.. నేను మాట్లాడడం ఆపాలా.. లేక ఆమెను నేను వేదిక పైకి పిలవాలా.. అంటూ అడిగారు. దీనికి ఝాన్సీ.. లేదు సార్ నేనే పిలుస్తాను.. అంటూ వేదికపైకి శ్రీలీలను ఆమె ఆహ్వానించారు.

    కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్​ అవుతోంది. ఒక మంత్రి మాట్లాడుతున్నప్పుడు ఆపడం సభా మర్యాద కాదన్న ఇంకిత జ్ఞానం ఈ సినిమా వారికి లేకుండా పోయిందని నెటిజన్లు మండిపడుతున్నారు. ముందుగా వచ్చిన మంత్రిని ఆపి, ఆలస్యంగా వచ్చిన హీరోయిన్ ను హడావుడిగా పిలవడం ఏమిటో ఆ ఝాన్సీకే తెలియాలంటూ గుర్రుమంటున్నారు. వేదికపై కుర్చీలు ఎలాగూ లేవు. మంత్రి ప్రసంగం అయ్యేంత వరకు శ్రీలీలను కిందనే వీఐపీల కోసం ఏర్పాటు చేసిన కుర్చీల్లో కూర్చోబెట్టి, శ్రీధర్​బాబు ప్రసంగం అయిపోయాక పిలిస్తే బాగుండేది.. ఇదేం తెలివి తక్కువ మర్యాద అంటూ కామెంట్లు పెడుతున్నారు.

    READ ALSO  Cyber Fraud | ఇదో తరహా సైబర్ మోసం.. ఉద్యోగం పేరిట దోచేశారు..

    Latest articles

    Khamenei | ఖ‌మేనీని టార్గెట్ చేసిన ఇజ్రాయిల్‌.. చంపొద్ద‌ని వారించిన ట్రంప్‌

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Khamenei : ఇరాన్‌తో యుద్ధం జ‌రుగుతున్న వేళ ఇజ్రాయిల్ భారీ ప్ర‌ణాళిక వేసింది. ఇరాన్ సుప్రీం...

    Caste Census | జ‌న‌, కుల గ‌ణ‌న‌కు స‌న్నాహాలు.. సోమవారం నోటిఫికేష‌న్ విడుద‌ల

    అక్షరటుడే, న్యూఢిల్లీ: కేంద్ర ప్ర‌భుత్వం (central government) జ‌న గ‌ణ‌న‌(population Census)కు స‌న్నాహాలు చేస్తోంది. ఇందుకు సంబంధించి సోమ‌వారం...

    Sonia Gandhi | సోనియాగాంధీకి అస్వ‌స్త‌త‌.. ఆస్ప‌త్రిలో చేరిక‌

    అక్షరటుడే, న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు సోనియాగాంధీ (Senior Congress leader Sonia Gandhi) ఆదివారం అస్వ‌స్త‌త‌కు గుర‌య్యారు....

    CM Revanth | ఆధునిక పరిశ్రమ అవసరాలకు తగినట్లుగా ఐటీఐల సిలబస్‌ అప్‌గ్రేడ్.. ప్రత్యేక కమిటీకు సీఎం ఆదేశం​

    అక్షరటుడే, హైదరాబాద్: CM Revanth : తెలంగాణలో వీఎఫ్ఎక్స్‌, గేమింగ్‌, ఆడియో విజువల్స్ రంగాలకు సంబంధించి సెంటర్ ఆఫ్...

    More like this