అక్షరటుడే, వెబ్‌డెస్క్: Simhadri Appanna : సింహాద్రి అప్పన్న చందనోత్సవంలో ప్రమాదం సంభవించింది. గోడ కూలిపోయిన ప్రమాదంలో ఎనిమిది మంది మరణించారు. మృతుల్లో ఐదుగురు పురుషులు, ముగ్గురు మహిళలు ఉన్నారు.
సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవం Simhadri Appanna Swamy Chandan Festival సందర్భంగా స్వామి నిజరూప దర్శనం కోసం భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. సింహాచలంలో మంగళవారం అర్ధరాత్రి భారీ వర్షం కురిసింది. సింహగిరి బస్టాండు నుంచి ఎగువకు వెళ్లే మార్గంలో షాపింగ్ కాంప్లెక్స్ వద్ద రూ.300 టికెట్ క్యూలైన్ మీద సిమెంటు గోడ కూలిపోయింది.
ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. హోంమంత్రి వంగలపూడి అనిత Home Minister Vangalapudi Anitha, విశాఖ కలెక్టర్ హరేంధిర ప్రసాద్, పోలీసు కమిషనర్ శంఖబ్రత బాగ్చీ ఘటనా స్థలాన్ని సందర్శించారు. సహాయక చర్యలను వారు పర్యవేక్షించారు. మృతదేహాలను విశాఖ కేజీహెచ్ కు తరలించారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.
సింహాచలం ప్రమాదంపై సీఎం చంద్రబాబు నాయుడు CM Chandrababu Naidu దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడ్డవారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు తెలిపారు.
సింహాచలం ఘటన దురదృష్టకరమని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ Deputy CM Pawan Kalyan పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఘటనపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నట్లు చెప్పారు.