అక్షరటుడే, వెబ్డెస్క్: Amit shah | కేంద్ర హోంమంత్రి అమిత్షా జమ్మూకశ్మీర్లోని పహల్గామ్కు చేరుకున్నారు. ఉగ్రవాదుల దాడిలో మృతులకు నివాళులర్పించారు. అనంతరం మృతుల కుటుంబీకులతో మాట్లాడారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అలాగే పర్యాటకులు మరణించిన బైసారన్ గడ్డి మైదానానికి హోంమంత్రి అమిత్ షా వెళ్లి పరిశీలించారు. ఘటనకు సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు. అక్కడి పరిస్థితిని సమీక్షించారు.
